ODI WC Qualifier 2023: వెస్టిండీస్‌ జట్టు కోచ్‌గా మాజీ కెప్టెన్‌.. ఎవరంటే?

Former captain Carl Hooper joins West Indies coaching set up - Sakshi

జింబాబ్వే వేదికగా జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌-2023 క్వాలిఫియర్స్‌కు ముందు క్రికెట్‌ వెస్టిండీస్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. విండీస్‌ అసిస్టెంట్ కోచ్‌గా ఆ జట్టు మాజీ కెప్టెన్‌ కార్ల్ హూపర్ ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని విండీస్‌ క్రికెట్‌బోర్డు ఓ ప్రకటనలో వెల్లడించింది.

హూపర్‌ ప్రస్తుతం బార్బడోస్‌లోని వెస్టిండీస్ హై-పెర్ఫార్మెన్స్ సెంటర్‌లో ఇన్‌స్ట్రాక్టర్‌గా ఉన్నాడు. కాగా హూపర్‌కు గతంలో ​కోచ్‌గా, మెంటార్‌గా పనిచేసిన అనుభవం ఉంది. గతేడాది బిగ్‌బాష్‌ లీగ్‌లో అడిలైడ్ స్ట్రైకర్స్‌కు అసిస్టెంట్ కోచ్‌గా పనిచేశాడు. 

అదేవిధంగా కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో గత కొన్ని సీజన్‌లగా గయానా అమెజాన్ వారియర్స్‌ కోచింగ్‌ స్టాప్‌లో కూడా హూపర్‌ భాగంగా ఉన్నాడు. ఇక విండీస్‌ తరపున  329 మ్యాచ్‌లు ఆడిన హూపర్‌.. 5000 పైగా పరుగులతో పాటు 100 వికెట్లు సాధించాడు. దాదాపు 15 ఏళ్లపాటు కరీబియన్‌ జట్టుకు హూపర్‌ సేవలు అందించాడు. ఇక ఐసీసీ వన్డే సూపర్‌ లీగ్‌ పాయింట్ల పట్టికలో టాప్‌-8లో విండీస్‌ జట్టు లేకపోవడంతో.. ఈ ఏడాది భారత్‌ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్‌కు నేరుగా అర్హతసాధించలేదు.

                              

ఈ క్రమంలో హోప్‌ సారధ్యంలోని విండీస్‌ క్వాలిఫియర్స్‌ మ్యాచ్‌లు ఆడనుంది. ఈ క్వాలిఫియర్‌ రౌండ్‌ మ్యాచ్‌లు జూన్ 18 నుంచి జింబాబ్వే వేదికగా జరగనున్నాయి. ఇందులో మొత్తం 10 జట్లు పాల్గొనున్నాయి. వీటిలో రెండు జట్లు ప్రపంచకప్‌కు అర్హత సాధిస్తాయి. ఇక క్వాలిఫియర్స్‌కు ముందు వెస్టిండీస్‌.. యూఏఈతో మూడు వన్డేల సిరీస్‌లో తలపడనుంది. ఈ సిరీస్‌ జూన్‌ 4 నుంచి ప్రారంభం కానుంది.
చదవండి: WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు ఆసీస్‌కు ఆ ఇద్దరంటే భయం పట్టుకుంది: పాంటింగ్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top