ఈసాల కప్ నమ్దే అంటావ్‌..

Fine If Bigger UAE Grounds Suit RCB, Umesh Yadav - Sakshi

దుబాయ్‌: ఈసాల కప్ నమ్దే(ఈసారి కప్‌ మనదే).. ఇది రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్సీబీ) నినాదం. గత కొన్ని సీజన్‌లుగా ఇదే స్లోగన్‌తో ఆర్సీబీ బరిలోకి దిగడం , భారంగా కప్‌ను కొట్టకుండానే టోర్నీ నుంచి ముగించడం జరుగుతుంది.  2016లో ఫైనల్‌కు చేరిన ఆర్సీబీ.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ చేతిలో ఓడిపోయి రన్‌రప్‌గా సరిపెట్టుకుంది. ఆ ఒక్క సీజన్‌ మినహా ఆర్సీబీ ఐపీఎల్‌లో ఆకట్టుకున్న సందర్భంలేదు. ఆర్సీబీలో ఆది నుంచి హేమాహేమీ క్రికెటర్లు ఉన్నప్పటికీ ఆ జట్టు కప్‌ కొట్టడంలో విఫలమవుతుంది. కోహ్లి వంటి ఒక స్టార్‌ క్రికెటర్‌, ఏబీ డివియర్స్‌ వంటి 360 డిగ్రీస్‌ ఆటగాడు ఉన్నా ఆ జట్టు నాకౌట్‌ చేరడానికే అపసోపాలు పడుతుంది. ఐపీఎల్‌ ఆరంభమయై 12 ఏళ్ల గడిచిన తరుణంలో ఈసారైనా కప్‌ను కొట్టాలని భావిస్తోంది. ఫ్యాన్స్‌ కోసమైనా కప్‌ను గెలవాలనే కసితో బరిలోకి దిగుతోందని ఆర్సీబీ పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌ పేర్కొన్నాడు. (చదవండి: సీఎస్‌కేకు మరో ఎదురుదెబ్బ!)

యూఏఈలో పెద్ద గ్రౌండ్‌లో ఉన్నా తమకు అతికినట్లు సరిపోతాయని అంటున్నాడు. కాకపోతే కాస్త శ్రమించాల్సిన అవసరం ఉందని తెలిపాడు. ఏది ఏమైనా తమకు ఫ్యాన్స్‌కు కప్‌ను అందించాలనే సంకల్పంతో పోరుకు సిద్ధమవుతున్నట్లు స్పష్టం చేశాడు. క్రికెట్‌ విశ్లేషకులు చెబుతున్నట్లు లెక్కకు మించి ఇక్కడ శ్రమించాలనే దానితో ఏకీభవిస్తున్నట్లు తెలిపాడు. ‘ ఇది క్రికెట్‌. ఇక్కవ ఎవరూ ఫేవరెట్లు కాదు. ఈ టోర్నమెంట్‌లో ఫేవరెట్‌ ఎవరంటే ఏమి చెబుతాం. మనం కష్టించే తత్వమే మనల్ని రేసులో నిలబెడుతుంది.  ఇప్పుడు దానిపైనే దృష్టి పెట్టాం. మన వ్యక్తిగత ప్రదర్శనలు చాలా ముఖ్యం. మాకు పెద్ద గ్రౌండ్‌లతో సమస్య ఉండదనే అనుకుంటున్నా. అది కూడా హార్డ్‌వర్క్‌ చేసినప్పుడే అవి పెద్ద గ్రౌండ్‌లా.. చిన్న గ్రౌండ్‌లా అనిపించవు. మాకు పరిస్థితులు అనుకూలిస్తాయనే ఆశిస్తున్నాం. 100 శాతం ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉంది’ అని ఉమేశ్‌ తెలిపాడు.(చదవండి: సీఎస్‌కే వాట్సాప్‌ గ్రూప్‌ నుంచి రైనా ఔట్‌?)

గత సీజన్లలో ఆర్సీబీ హోమ్‌ గ్రౌండ్‌ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం. మరి చాలా చిన్నస్టేడియం. ఇది బౌలర్ల కంటే బ్యాట్స్‌మన్‌కే అనుకూలిస్తోంది. అద్భుతమైన బ్యాటింగ్‌ లైనప్‌ కల్గిన ఆర్సీబీకి చిన్నస్వామి స్టేడియం చక్కగా సెట్‌ అవుతుంది. మరి ఈ సీజన్‌ ఐపీఎల్‌ యూఏఈలో జరుగుతుంది. ఇక్కడ హోమ్‌ గ్రౌండ్‌లో ఫేవరెట్‌ గ్రౌండ్‌లు లేవు. ఇక్కడ మైదానాలు పెద్దవిగానే ఉంటాయి. దాంతో ఆర్సీబీకి గతం కంటే ఎక్కువ సమస్యలు వస్తాయోమోనని ఆందోళన వ్యక్తమవుతోంది. దీనికి ఉమేశ్‌ యాదవ్‌ ఇచ్చే సమాధానం మిక్కిలి కష్టపడటం. ఏది ఏమైనా ఈసాల కప్‌ నమ్దే అనే నమ్మకంతో ఉన్నాడు ఉమేశ్‌.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top