Indian Team: భారత్ ఘనవిజయం

FIH Hockey Pro League- పాచెఫ్‌స్ట్రోమ్ (దక్షిణాఫ్రికా): అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) పురుషుల ప్రొ లీగ్‌లో భారత జట్టు శుభారంభం చేసింది. ఫ్రాన్స్ జట్టుతో మంగళవారం జరిగిన తొలి లీగ్ మ్యాచ్‌లో భారత్ 5–0 గోల్స్ తేడాతో ఘనవిజయం సాధించింది. తొలి క్వార్టర్‌లో భారత్‌ను గోల్ చేయనీకుండా నిలువరించిన ఫ్రాన్స్ ఆ తర్వాత చేతులెత్తేసింది.
భారత్ తరఫున ‘డ్రాగ్ ఫ్లికర్’ హర్మన్‌ప్రీత్ సింగ్ (21వ ని.లో), వరుణ్ కుమార్ (24వ ని.లో), షంషేర్ సింగ్ (28వ ని.లో), మన్‌దీప్ సింగ్ (32వ ని.లో), కెరీర్‌లో 200వ మ్యాచ్ ఆడిన ఆకాశ్‌దీప్ సింగ్ (41వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. బుధవారం జరిగే మరో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో భారత్ ఆడుతుంది.
చదవండి: Ranji Trophy 2022: టీమిండియాలో స్థానం కోసం పోరాటం.. ప్రత్యర్థులుగా రహానే, పుజారా!
మరిన్ని వార్తలు