కోహ్లికి అందమైన భార్య అనుష్క.. మాకేం పని?

Farokh Comes Out In Support Of Sunil Gavaskar Over His Controversy - Sakshi

న్యూఢిల్లీ:  ఇటీవల భారత దిగ్గజ క్రికెటర్‌ సునీల్‌ గావస్కర్‌, టీమిండియా కెప్టెన్‌ కోహ్లి భార్య అనుష్క శర్మల మధ్య వివాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే.  కింగ్స్‌ పంజాబ్‌తో మ్యాచ్‌ తర్వాత కోహ్లికి సరైన ప్రాక్టీస్‌ లేదని, అనుష్క శర్మ బౌలింగ్‌ను లాక్‌డౌన్‌లో ప్రాక్టీస్‌ చేయడంతో విఫలం అవుతున్నాడని గావస్కర్‌ వ్యాఖ్యానించాడు. దీనిపై సోషల్‌ మీడియాలో ఒక వర్గం అభిమానులతో పాటు అనుష్క శర్మ కూడా మండిపడ్డారు. కోహ్లి బ్యాటింగ్‌ వైఫల్యం విషయంలో తనను ఎందుకు లాగుతున్నారంటూ కౌంటర్‌ ఎటాక్‌ దిగారు.

‘మిస్టర్‌ గావస్కర్‌... మీ వ్యాఖ్య అమర్యాదగా ఉంది. అయితే భర్త ఆట గురించి భార్యను తప్పు పడుతున్నట్లుగా ఉన్న ఈ వ్యాఖ్య మీ నుంచి ఎలా వచ్చింది. ఇన్నేళ్లుగా ఆటగాళ్ల వ్యక్తిగత జీవితాల గురించి కామెంటరీలో మీరు ఎప్పుడూ మాట్లాడలేదు. నాకు కూడా అలాంటి గౌరవం ఇవ్వాలని మీరు అనుకోలేదా’ అంటూ ప్రశ్నించారు. అనుష్క కామెంట్స్‌పై గవాస్కర్‌ స్పందిస్తూ..  తాను ఎలాంటి తప్పుడు మాట మాట్లాడలేదని, కొందరు వక్రీకరించడంతో సమస్య వచ్చిందంటూ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. ఇక్కడ అనుష్కపై విమర్శలు ఎక్కడ చేశానో చూపించాలన్నారు.(చదవండి:నా కెప్టెన్సీ స్కిల్స్‌కు అతనే కారణం: రోహిత్‌)

ఈ వివాదంపై ఇప్పటికే గావస్కర్‌కు టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ మద్దతుగా నిలవగా, తాజాగా  మాజీ వికెట్‌ కీపర్‌ ఫరూక్‌ ఇంజినీర్‌ కూడా అండగా నిలిచారు. ‘నాకు గావస్కర్‌ గురించి బాగా తెలుసు. అది గావస్కర్‌ కాస్త జోక్‌గా చెప్పారనే నేను అనుకుంటున్నా. ఇందులో ఎటువంటి తీవ్రత లేదు. దీనిపై రాద్దాంతం అనవసరం’ అని ఫరూక్‌ అన్నారు.

నా విషయంలో ఇదే తంతు..
గతంలో అనుష్క శర్మను విమర్శించిన క్రమంలో తనపై కూడా ఇలానే విమర్శలు వచ్చాయన్నారు.  ఆ వివాదాన్ని కూడా రాద్దాంత చేశారని ఫరూక్‌ గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో టీమిండియా సెలక్టర్లను విమర్శించే క్రమంలో అనుష్క శర్మకు టీ కప్పులు ఇవ‍్వడానికి వెళ్లారా అంటూ ప్రశ్నించడాన్ని తప్పుబట్టారు. దీనిపై అనుష్క శర్మ స్పందిస్తూ.. ఫరూక్‌పై మండిపడ్డారు. ఇదే విషయాన్ని ప్రస్తావించిన 82 ఏళ్ల ఈ మాజీ క్రికెటర్‌.. ‘ అనుష్కను నేను కానీ గావస్కర్‌ కానీ ఎందుకు విమర్శిస్తాం. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి అనుష్క అందమైన భార్య. వారిని విమర్శించే అవసరం మాకు లేదు. గావస్కర్‌ ఏదో సరదాగా వ్యాఖ్యానించి ఉంటారు.  అంతేకానీ వేరే ఉద్దేశం ఉండదని నా అభిప్రాయం’ అని ఫరూక్‌ పేర్కొన్నారు.(చదవండి: ఊరిస్తున్న సన్‌రైజర్స్‌ టైటిల్‌ సెంటిమెంట్‌!)

గతేడాది వన్డే వరల్డ్‌కప్‌ సందర్భంగా సెలక్షన్‌  కమిటీతో పాటు అనుష్క శర్మను ఫరూక్‌ తీవ్రంగా తప్పుబట్టారు. ‘మన సెలక్షన్‌ కమిటీ ఎంపికకు దేన్ని ప్రామాణికంగా తీసుకున్నారు. వారు ఆడింది 10 నుంచి 12 టెస్టులు మాత్రమే. అసలు వరల్డ్‌కప్‌కు వెళ్లిన సెలక్టర్లు ఎవరో కూడా నాకు సరిగ్గా తెలీదు. కానీ వారు భారత జెర్సీలు ధరించడంతో సెలక్టర్లలో ఒకరిగా అనుకున్నా(ఎంఎస్‌కే ప‍్రసాద్‌ను ఉద్దేశిస్తూ). ఈ సెలక్టర్లు కోహ్లి భార్య అనుష్కకు టీ కప్‌లు అందివ్వడం నేను చూశా. నాతో పాటు అంతా చూసి ఉండవచ్చు. అనుష్క శర్మకు టీ కప్‌లు ఇవ్వడం కోసం వారు పని చేశారు’ అని ఘాటుగా స్పందించారు. అది అప్పట్లో వివాదానికి దారి తీసింది.

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

26-10-2020
Oct 26, 2020, 08:31 IST
ఓడిపోవాలని ఎవరూ కోరుకోరు, అయితే అందరూ విజేతలు కాలేరు! మైదానాన్ని వీడే సమయంలో వినకూడని శబ్దాలు, చూడకూడని సైగలు.. మనోబలంతో వాటిపై పైచేయి...
25-10-2020
Oct 25, 2020, 23:11 IST
అబుదాబి:ఈ సీజన్‌లో అడపా దడపా విజయాలతో ఢీలా పడ్డ రాజస్తాన్‌ రాయల్స్‌.. ఎట్టకేలకు భారీ విజయాన్ని సాధించింది. ముంబై నిర్దేశించిన...
25-10-2020
Oct 25, 2020, 22:31 IST
దుబాయ్‌: ఈ ఐపీఎల్‌ సీజన్‌ ప్లేఆఫ్స్‌ షెడ్యూల్‌ను ఆదివారం ప్రకటించారు. ముందస్తు షెడ్యూల్‌లో  కేవలం లీగ్‌ దశలో మ్యాచ్‌లనే వెల్లడించగా, తాజాగా...
25-10-2020
Oct 25, 2020, 21:31 IST
అబుదాబి: రాజస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 196 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన...
25-10-2020
Oct 25, 2020, 19:13 IST
అబుదాబి:  రాజస్తాన్‌ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన ముంబై ఇండియన్స్‌ తాత్కాలిక...
25-10-2020
Oct 25, 2020, 18:46 IST
దుబాయ్‌: వరుస ఓటములతో ఢీలా పడ్డ చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఎట్టకేలకు మరో విజయాన్ని సాధించింది. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో...
25-10-2020
Oct 25, 2020, 17:51 IST
దుబాయ్‌: నాలుగు రోజుల క్రితం కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఎనిమిది వికెట్ల తేడాతో ఘనమైన విజయాన్ని సాధించింది....
25-10-2020
Oct 25, 2020, 17:11 IST
దుబాయ్‌:  చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఆర్సీబీ 146 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న...
25-10-2020
Oct 25, 2020, 16:48 IST
దుబాయ్‌: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో కింగ్స్‌ పంజాబ్‌ అనూహ్య విజయం సాధించింది. సన్‌రైజర్స్‌ గెలుస్తుందనుకునే తరుణంలో కింగ్స్‌...
25-10-2020
Oct 25, 2020, 16:02 IST
దుబాయ్‌:  సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్‌ పంజాబ్‌ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. లో స్కోరింగ్‌ మ్యాచ్‌లో...
25-10-2020
Oct 25, 2020, 15:18 IST
దుబాయ్‌: చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన...
25-10-2020
Oct 25, 2020, 05:10 IST
వరుణ్‌ చక్రవర్తి (4–0–20–5) ... ఈ మ్యాచ్‌కు ముందు ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లో  తీసిన వికెట్లు 7. ఒక మ్యాచ్‌లో...
25-10-2020
Oct 25, 2020, 04:57 IST
విజయలక్ష్యం 127 పరుగులు... స్కోరు 100/3... మరో 24 బంతుల్లో 27 పరుగులు చేస్తే చాలు... కానీ ఇలాంటి స్థితి...
24-10-2020
Oct 24, 2020, 23:47 IST
దుబాయ్‌: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కింగ్స్‌ పంజాబ్‌ 12 పరుగుల తేడాతో విజయం సాధించింది. లో స్కోరింగ్‌ మ్యాచ్‌లో...
24-10-2020
Oct 24, 2020, 22:03 IST
దుబాయ్‌: ఈ ఐపీఎల్‌ సీజన్‌లో అత్యంత దారుణంగా విఫలమైన బ్యాట్స్‌మెన్‌లలో కింగ్స్‌ పంజాబ్‌ క్రికెటర్‌ మ్యాక్స్‌వెల్‌ ఒకడు. గతంలో ఎప్పుడూ...
24-10-2020
Oct 24, 2020, 21:28 IST
దుబాయ్‌: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్‌ పంజాబ్‌ 127 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. ఆరెంజ్‌ ఆర్మీ బౌలర్లు అదరగొట్టడంతో...
24-10-2020
Oct 24, 2020, 20:03 IST
షార్జా: ముంబై ఇండియన్స్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే చిత్తుగా ఓడిన సంగతి తెలిసిందే. సీఎస్‌కే 115 పరుగుల టార్గెట్‌ను...
24-10-2020
Oct 24, 2020, 19:19 IST
అబుదాబి: ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ 59 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌లో ఆకట్టుకున్న...
24-10-2020
Oct 24, 2020, 19:09 IST
దుబాయ్‌: ఈ ఐపీఎల్‌ సీజన్‌లో భాగంగా కింగ్స్‌ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది....
24-10-2020
Oct 24, 2020, 17:46 IST
అబుదాబి: క్రికెట్‌లో తొలి బంతికే వికెట్‌ కోల్పోతే ఆ జట్టు ఒత్తిడిలో పడటం ఖాయం. ఐపీఎల్‌లో భాగంగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top