Fans Demand Dravid Should Sack From Head Coach Role IN Lost WI 2nd ODI - Sakshi
Sakshi News home page

#SackRahulDravid: 'లాభం కంటే నష్టమే ఎక్కువ.. తక్షణమే ద్రవిడ్‌ను తొలగించండి'

Published Sun, Jul 30 2023 11:12 AM

Fans Demand-Dravid Should Sack From Head Coach Role IND Lost WI 2nd-ODI - Sakshi

వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఓటమి అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. వరల్డ్‌కప్‌కు క్వాలిఫై అవ్వని జట్టు చేతిలో ఓడిపోయి రోహిత్‌ సేన పరువు పోగొట్టుకుందని పేర్కొన్నారు. ప్రతిష్టాత్మక వన్డే వరల్డ్‌కప్‌కు ముందు అనవసర ప్రయోగాలకు పోయి చేతులు కాల్చుకుంటుంది. మంచి ఫామ్‌లో ఉన్న రోహిత్‌, కోహ్లిలకు విశ్రాంతినివ్వడం ఏంటని తప్పబట్టారు.

పనిలో పనిగా టీమిండియా హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ను కూడా అభిమానులు ఒక రౌండ్‌ వేసుకున్నారు. ద్రవిడ్‌ కోచ్‌గా వచ్చినప్పటి నుంచి టీమిండియాకు ఏది కలిసి రావడం లేదని.. ఒక్క పెద్ద టోర్నీని కూడా గెలవలేకపోయిందని పేర్కొన్నారు.

ద్రవిడ్‌ కోచ్‌గా వచ్చిన తర్వాత బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌ కోల్పోయిన టీమిండియా.. ఆ తర్వాత సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో ఓటమి చవిచూసింది. ఆ తర్వాత అదే ప్రొటిస్‌ జట్టుకు వన్డే సిరీస్‌ను కూడా అప్పగించింది. అటుపై ఆసియా కప్‌ను నెగ్గడంలో విఫలమైన టీమిండియా టి20 వరల్డ్‌కప్‌లోనూ సెమీస్‌లోనే చేతులెత్తేసింది.

ఆసీస్‌తో టెస్టు సిరీస్‌ను నెగ్గినా వన్డే సిరీస్‌ను.. ఆ తర్వాత జరిగిన వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌(డబ్ల్యూటీసీ ఫైనల్‌ 2023)లో ఆసీస్‌ చేతిలో దారుణ పరాజయం చవిచూసింది. ద్రవిడ్‌ కోచ్‌గా వచ్చిన తర్వాత గెలుపు శాతం కంటే ఓటముల పర్సంటేజ్‌ ఎక్కువగా ఉండడం ఆసక్తి కలిగించింది. ఈ లెక్కన టీమిండియా ద్రవిడ్‌ వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగిందని చెప్పొచ్చు.

ద్రవిడ్‌ కోచ్‌గా వచ్చిన తర్వాత టీమిండియా ఓడిన సిరీస్‌లు
► బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్‌
► సౌతాఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్‌తో పాటు వన్డే సిరీస్‌
► ఆసియా కప్‌లో ఓటమి
► టి20 వరల్డ్‌కప్‌లో సెమీస్‌లో ఓటమి
► స్వదేశంలో ఆసీస్‌తో వన్డే సిరీస్‌లో ఓటమి
► డబ్ల్యూటీసీ 2023 ఫైనల్లో ఆసీస్‌ చేతిలో పరాజయం

దీంతో క్రికెట్‌ ఫ్యాన్స్‌ ద్రవిడ్‌పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ద్రవిడ్‌ పిచ్చి ప్రయోగాలు వల్ల టీమిండియాకు లాభాల కంటే నష్టమే ఎక్కువని ఆరోపణలు చేస్తున్నారు. #SackDravid.. అంటూ హ్యాష్ ట్యాగ్‌తో పోస్టులు చేస్తున్నారు. ''సచిన్ 194 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. ఇప్పుడు కోహ్లి రెడ్ హాట్ ఫామ్‌లో ఉన్నప్పుడు అతనికి విశ్రాంతి ఇస్తున్నారు. అనేక సమస్యలు.. ఒకటే పరిష్కారం.. ద్రవిడ్‌ను తొలగించండి'' అని ఓ నెటిజన్ కోరారు. 

అయితే ఓటమి తర్వాత మీడియాతో మాట్లాడిన ద్రవిడ్.. ఆసియా కప్‌, ఆ తర్వాత వరల్డ్ కప్‌కు వెళ్లే ముందు వెస్టిండీస్ సిరీస్ తమకు ఈ ప్రయోగాలను చేయడానికి చివరి అవకాశంగా ఉపయోగపడిందని వివరించాడు. గాయపడిన ఆటగాళ్లు శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ తిరిగి రావడం గురించి అనిశ్చితి కారణంగా.. వారిని వారు మ్యాచ్ సిద్ధంగా ఉంచుకోవడానికి బ్యాకప్ ఎంపికలకు కొంత సమయం ఇవ్వవలసి ఉంటుందని సమర్థించుకోవడం ఆసక్తి  రేపింది.

చదవండి: ICC ODI WC 2023: వరల్డ్‌కప్‌ జరిగేది మన దగ్గర.. విండీస్‌లో కాదుగా; ఈ ప్రయోగాలేంది?

Carlos Alcaraz: సంచలనాల 'అల్‌కరాజ్‌'.. 'ఆల్‌టైమ్‌ గ్రేట్‌' లక్షణాలు పుష్కలంగా

Advertisement

తప్పక చదవండి

Advertisement