బాల్‌ కోసం వెయిట్‌ చేస్తూ ప్రాణాలతో చెలగాటం

A Fan Risks His Life To Collect The Ball Hit By Jadeja - Sakshi

షార్జా:  రాజస్తాన్‌ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ పించ్‌ హిట్టర్‌ ఏబీ డివిలియర్స్‌ ధాటికి బౌండరీలు కూడా చిన్నబోయాయి. 22 బంతుల్లో 1 ఫోర్‌, 6 సిక్స్‌లతో అజేయంగా 55 పరుగులు సాధించి మరొకసారి ఆర్సీబీకి విజయాన్ని అందించాడు. శనివారం డబుల్‌ హెడర్‌ మ్యాచ్‌ల్లో భాగంగా తొలుత  ఒక మంచి మజా మ్యాచ్‌ చూసిన తర్వాత సీఎస్‌కే-ఢిల్లీ క్యాపిటల్స్‌ మ్యాచ్‌ కూడా అంతే ఆసక్తికరంగానే సాగింది. చివరి ఓవర్‌ వరకూ వచ్చిన ఆ మ్యాచ్‌లో ఢిల్లీ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.  చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ విజయం సాధించింది. ఢిల్లీ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ బ్యాట్‌ ఝుళిపించి ఆ జట్టుకు ఘనమైన విజయాన్ని అందించాడు. 

ఢిల్లీలోని మిగతా టాపార్డర్‌ ఆటగాళ్లు తడబడ్డ చోట ధావన్‌ మెరిశాడు. తాను ఎప్పుడూ క్లాస్‌ ఆటగాడననే చెప్పుకునే ధావన్‌.. ఒక మాస్టర్‌ క్లాస్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. 58 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్స్‌తో అజేయంగా 101 పరుగులు సాధించి గెలుపులో కీలక పాత్ర పోషించాడు.   ఢిల్లీ విజయానికి ఆఖరి ఓవర్‌లో 17 పరుగులు అవసరమైన సమయంలో ఆ బాధ్యతను అక్షర్‌ తీసుకున్నాడు. జడేజా వేసిన ఆఖరి ఓవర్‌ తొలి బంతికి ధావన్‌ సింగిల్‌ తీయగా,  అక్షర్‌ వరుసగా రెండు సిక్స్‌లు కొట్టి మ్యాచ్‌ను తమవైపుకు తిప్పుకున్నాడు.  ఇక నాల్గో బంతికి రెండు పరుగులు తీసిన అక్షర్‌.. ఐదో బంతికి మరో సిక్స్‌ కొట్టి ఢిల్లీని గెలిపించాడు. ధావన్‌ సెంచరీకి అక్షర్‌ మంచి ఫినిషింగ్‌ ఇవ్వడంతో ఢిల్లీ ఇంకా బంతి ఉండగా విజయం సాధించింది. అక్షర్‌ 5 బంతుల్లో అజేయంగా 21 పరుగులు సాధించడంతో అప‍్పటివరకూ సీఎస్‌కే వైపు ఉన్న మ్యాచ్‌  కాస్తా ఢిల్లీ ఎగురేసుకుపోయింది.

బాల్‌ కోసం ప్రాణాలతో చెలగాటం..
సీఎస్‌కే ఇన్నింగ్స్‌లో ఒక విషయం కచ్చితంగా చెప్పుకోవాలి. జడేజా క్రీజ్‌లోకి రాకముందు- వచ్చిన తర్వాత అనే విషయాన్ని ప్రస్తావించక తప్పదు. జడేజా వచ్చిన తర్వాత సీఎస్‌కే ఇన్నింగ్స్‌ పరుగులు తీసింది. జడేజా కొట్టిన నాలుగు సిక్స్‌లతో సీఎస్‌కే స్కోరు బోర్డు ఈజీగా 170 పరుగుల మార్కును దాటేసింది. అయితే జడేజా కొట్టిన ఒక సిక్స్‌ ఇప్పుడు వార్తల్లో నిలిచింది. సిక్స్‌లు కొట్టడం, అవి స్టేడియాలు దాటడాన్ని కామన్‌గా చూస్తున్నాం. కానీ ఆ సిక్స్‌ రోడ్డుపై పడటం ఒకటైతే,  ఆ బంతిని తీయడానికి ఒక అభిమాని రిస్క్‌ చేయడం కెమెరాల్లో రికార్డయ్యింది. బంతి కోసం గ్రౌండ్‌ బయట వేచి చూస్తున్న సదరు అభిమాని రోడ్డు మధ్యలోకి పరుగెత్తి దాన్ని తీయడం కామెంటేటర్లను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. తొలుత అతని డేరింగ్‌ను మెచ్చుకున్నప్పటికీ వీకెండ్‌లో అలా రోడ్డు మధ్యలోకి రావడం చాలా రిస్క్‌ అని కామెంటేటర్‌ సైమన్‌ డౌల్‌ అన్నారు. అసలు వీకెండ్‌లో రోడ్డుపై తనకు పరుగెత్తే అవకాశమే ఉండదంటూ అది ఎంత ప‍్రమాదకరమో అనే విషయాన్ని పరోక్షంగా చెప్పారు. బంతిని ఇంటికి తీసుకెళ్లడం కోసం  ఇలా ఫ్యాన్స్‌ బయట వేచి చేయడం ఈ ఐపీఎల్‌లో చర‍్చనీయాంశమైంది.

తొలుత బ్యాటింగ్‌ చేసిన సీఎస్‌కే జట్టులో సామ్‌ కరాన్‌,ధోనిలు మినహా అంతా రాణించారు. డుప్లెసిస్‌ 47 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు, వాట్సన్‌ 28 బంతుల్లో 6 ఫోర్లతో 36 పరుగులు, రాయుడు 25 బంతుల్లో 1ఫోర్‌, 4 సిక్స్‌లతో 45 నాటౌట్‌, రవీంద్ర జడేజా 13 బంతుల్లో 4 సిక్స్‌లతో 33 నాటౌట్‌లు తలో చేయి వేసి సీఎస్‌కే 179 పరుగులు చేయడంలో సహకరించారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

30-10-2020
Oct 30, 2020, 21:22 IST
అబుదాబి:  రాజస్తాన్‌ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కింగ్స్‌ పంజాబ్‌ 186 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది.  క్రిస్‌ గేల్‌ (99; 63...
30-10-2020
Oct 30, 2020, 20:36 IST
లండన్‌:  కింగ్స్‌ పంజాబ్‌తో మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ను రాహుల్‌ తెవాటియా  గెలిపిస్తాడని అంటున్నాడు ఇంగ్లండ్‌ మాజీ స్పిన్నర్‌ గ్రేమ్‌ స్వాన్‌....
30-10-2020
Oct 30, 2020, 19:12 IST
అబుదాబి: ఈ ఐపీఎల్‌ సీజన్‌లో భాగంగా కింగ్స్‌ పంజాబ్‌తో జరుగుతున్న రెండో అంచె మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ టాస్‌ గెలిచి...
30-10-2020
Oct 30, 2020, 17:34 IST
లండన్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌-13వ సీజన్‌ యూకేలోనూ రికార్డులు బద్ధలు కొడుతోంది. వ్యూయర్‌షిప్‌ పరంగా ఐపీఎల్‌ యూకేలో కొత్త పుంతలు...
30-10-2020
Oct 30, 2020, 16:51 IST
న్యూఢిల్లీ:  ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) చరిత్రను చూస్తే సీఎస్‌కే ఎప్పుడూ వేలంలో దూకుడుగా ఉన్న దాఖలాలు లేవని, ఈసారి మాత్రం...
30-10-2020
Oct 30, 2020, 16:09 IST
అబుదాబి: ఈ ఐపీఎల్‌ సీజన్‌ రెండో అంచెలో భాగంగా బుధవారం ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 5 వికెట్ల...
30-10-2020
Oct 30, 2020, 14:47 IST
దుబాయ్‌ : ఐపీఎల్‌-2020 సీజన్‌లో భాగంగా గురువారం రాత్రి చెన్నై సూపర్‌ కింగ్స్‌, కోల్‌కత్తా నైట్‌ రైడర్స్‌ జట్ల మధ్య...
30-10-2020
Oct 30, 2020, 13:09 IST
అబుదాబి: ఐపీఎల్‌-2020 సీజన్‌లో ప్లే ఆఫ్స్‌ రేసుకు దూరమైన తర్వాత చెన్పై సూపర్‌ కింగ్స్‌ జట్టు ఆటలో పదును పెరిగింది....
30-10-2020
Oct 30, 2020, 11:46 IST
దుబాయ్‌: ఈ ఐపీఎల్‌ సీజన్‌లో ప్లేఆఫ్‌కు వెళ్లిన తొలి జట్టుగా డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ నిలిచింది.  ఇక గతేడాది...
30-10-2020
Oct 30, 2020, 10:04 IST
దుబాయ్‌ : ఐపీఎల్‌-2020 సీజన్‌లో ప్లే ఆఫ్స్‌ నుంచి దాదాపు దూరమైన చెన్నై సూపర్‌ కింగ్స్‌ (సీఎస్‌కే) పోతూపోతూ కోల్‌కత్తా నైట్‌...
30-10-2020
Oct 30, 2020, 08:10 IST
న్యూఢిల్లీ: పేలవ ప్రదర్శనతో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఈ సారి ఐపీఎల్‌ ప్లేఆఫ్స్‌కు దూరమైనా... వచ్చే ఏడాది కూడా ఎంఎస్‌...
30-10-2020
Oct 30, 2020, 05:06 IST
చెన్నై సూపర్‌ కింగ్స్‌ పోతూ పోతూ కోల్‌కతానూ లీగ్‌ నుంచే తీసుకెళ్లనుంది. మిగిలున్న రెండు మ్యాచ్‌ల్ని తప్పనిసరిగా గెలిచినా... అంతంత...
29-10-2020
Oct 29, 2020, 23:17 IST
దుబాయ్‌: ఐపీఎల్‌ 13వ సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ 5వ విజయాన్ని నమోదు చేసింది. కేకేఆర్‌ విధించిన 173 పరుగుల...
29-10-2020
Oct 29, 2020, 21:50 IST
దుబాయ్‌ : ఐపీఎల్‌ 13వ సీజన్‌లో కింగ్స్‌ ఎలెవెన్‌ పంజాబ్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ దుమ్మురేపే ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న సంగతి...
29-10-2020
Oct 29, 2020, 21:15 IST
దుబాయ్‌ : ఐపీఎల్‌ 13వ సీజన్‌లో చెన్నైతో జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి...
29-10-2020
Oct 29, 2020, 19:08 IST
దుబాయ్‌ : ఐపీఎల్‌ 13వ సీజన్‌లో గురువారం చెన్నై సూపర్‌ కింగ్స్‌, కేకేఆర్‌ మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. టాస్‌...
29-10-2020
Oct 29, 2020, 16:59 IST
దుబాయ్‌ : ఇంగ్లండ్‌ స్టార్‌ పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ ఐపీఎల్‌ 13వ సీజన్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి...
29-10-2020
Oct 29, 2020, 16:02 IST
అబుదాబి : ఐపీఎల్‌ 13వ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ జైత్రయాత్ర కొనసాగుతున్న సంగతి తెలిసిందే. బుధవారం ఆర్‌సీబీతో జరిగిన మ్యాచ్‌లో...
29-10-2020
Oct 29, 2020, 14:58 IST
అబుదాబి: నువ్వా- నేనా అంటూ పోటీపడే సందర్భంలో భావోద్వేగాలు నియంత్రించుకోవడం ఎవరికైనా కాస్త కష్టమే. ముఖ్యంగా క్రీడాకారుల విషయంలో ఇలాంటి...
29-10-2020
Oct 29, 2020, 14:08 IST
అబుదాబి: డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ ఐపీఎల్‌-2020 సీజన్‌లోనూ సత్తా చాటుతోంది. బుధవారం నాటి మ్యాచ్‌లో కోహ్లి సారథ్యంలోని రాయల్స్‌...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top