స్పెయిన్‌ వర్సెస్‌ స్విట్జర్లాండ్‌ 

Euro 2020: Switzerland Take On Spain For Spot In Semifinals - Sakshi

సెయింట్‌ పీటర్స్‌బర్గ్‌: యూరో కప్‌ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌లో శుక్రవారం జరిగే తొలి క్వార్టర్‌ ఫైనల్లో మూడుసార్లు చాంపియన్‌ స్పెయిన్‌తో స్విట్జర్లాండ్‌ జట్టు తలపడుతుంది. ప్రిక్వార్టర్‌ ఫైనల్లో ప్రస్తుత ప్రపంచ చాంపియన్, గత యూరో కప్‌ రన్నరప్‌ ఫ్రాన్స్‌ జట్టును ఓడించి స్విట్జర్లాండ్‌ ఈ మెగా టోర్నీలో తొలిసారి క్వార్టర్‌ ఫైనల్‌ చేరింది. అదే జోరును కొనసాగించి సెమీఫైనల్‌ బెర్త్‌ దక్కించుకోవాలని స్విట్జర్లాండ్‌ పట్టుదలతో ఉంది.

అయితే స్పెయిన్‌తో జరిగిన 22 మ్యాచ్‌ల్లో స్విట్జర్లాండ్‌ ఒక్కసారి మాత్రమే నెగ్గి 16 సార్లు ఓడిపోయి, ఐదుసార్లు ‘డ్రా’ చేసుకుంది. క్వార్టర్‌ ఫైనల్‌ చేరే క్రమంలో స్పెయిన్‌ మొత్తం 11 గోల్స్‌ చేసి టాప్‌ ర్యాంక్‌లో ఉంది. స్విట్జర్లాండ్‌ విజయావకాశాలు షాకిరి, సెఫరోవిచ్, గావ్రనోవిచ్‌ ఆటతీరుపై ఆధారపడి ఉన్నాయి. స్పెయిన్‌ జట్టు తరఫున మొరాటా, సారాబియా, సర్జియో బుస్కెట్స్, ఫెరెన్‌ టోరెస్‌ కీలకం కానున్నారు. రాత్రి 9 గంటల 30 నిమిషాలకు మొదలయ్యే ఈ మ్యాచ్‌ను సోనీ సిక్స్‌ చానెల్‌ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.   

ఇక్కడ చదవండి: Wimbledon 2021: సానియా జోడీ శుభారంభం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top