Sunil Gavaskar Comments on New Zealand vs England T20 World Cup 2021 Semi-Final: టీ20 ప్రపంచకప్-2021 చివరి అంకానికి చేరుకుంది. తొలి సెమిఫైనల్లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు హమీ తుమీ తేల్చుకోవడానికి సిద్దం అవుతున్నాయి. అబుదాబి వేదికగా బుధవారం(నవంబర్10)న ఇరు జట్లు మధ్య ఈ కీలక పోరు జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌పై భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. ఈ పోరులో ఇంగ్లండ్‌పై విజయం సాధించడం న్యూజిలాండ్‌కు అంత సులభం కాదు అని అతడు అభిప్రాయపడ్డాడు.
"టీ20 ప్రపంచకప్‌లో తొలి సెమిఫైనల్ పోరు ఆసక్తికరంగా ఉండనుంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను ఓడించడం అంత సులభం కాదు. ఎందుకంటే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఇంగ్లండ్ అద్బుతమైన జట్టు. 2015లో ఆస్ట్రేలియాలో జరిగిన వన్టే ప్రపంచ కప్‌లో గ్రూప్ దశలోనే నిష్క్రమించిన ఇంగ్లండ్ జట్టు తర్వాత వైట్-బాల్ క్రికెట్‌లో అద్బుతంగా రాణిస్తుంది. జోస్ బట్లర్, జానీ బెయిర్‌స్టో, లియామ్ లివింగ్‌స్టోన్ హిట్టర్లు ఇంగ్లండ్ జట్టులో ఉన్నారు. ఇయాన్ మోర్గాన్ మాదిరిగానే న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కూడా ప్రశాంతంగా ఉండి ప్రత్యర్థులను కట్టడం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాడు" అని గవాస్కర్ పేర్కొన్నాడు.
అయితే అంతక ముందు 2019 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో ఇరు జట్లు సమానంగా స్కోర్లు చేయడంతో మ్యాచ్ టై అయింది. అలా సూపర్ ఓవర్‌కు దారి తీసింది. సూపర్ ఓవర్‌లో కూడా ఇరు జట్లు 15 పరుగులే చేయడంతో మరోసారి టై అయింది. దీంతో ఇన్నింగ్స్‌లో ఎక్కువ బౌండరీలు కొట్టిన ఇంగ్లండ్‌ను ఐసీసీ విజేతగా ప్రకటించింది. టి20 ప్రపంచకప్ 2021లో సెమీస్‌లో మరోసారి ఈ ఇద్దరు తలపడుతుండడంతో కివీస్ ప్రతీకారం తీర్చుకుంటుందా అనేది వేచి చూడాలి.
చదవండి: న్యూజిలాండ్ సిరీస్‌కు ముందు భారత అభిమానులకు గుడ్ న్యూస్.


