కృనాల్‌ పాండ్యా నిర్బంధం | DRI officials detain Krunal Pandya at Mumbai airport | Sakshi
Sakshi News home page

కృనాల్‌ పాండ్యా నిర్బంధం

Nov 13 2020 6:24 AM | Updated on Nov 13 2020 6:24 AM

DRI officials detain Krunal Pandya at Mumbai airport - Sakshi

ముంబై: క్రికెటర్‌ కృనాల్‌ పాండ్యాను ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో  డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు నిర్బంధించారు. ముంబై ఇండియన్స్‌ ఆల్‌రౌండర్‌ పాండ్యా సరైన ధ్రువ పత్రాలు లేని బంగారం, ఇతర విలువైన వస్తువులు కలి గి వుండటంతో అతన్ని విమానాశ్రయంలోనే ఆపివేశారు. ఐపీఎల్‌–13 చాంపియన్‌ ముంబై జట్టు సభ్యుడైన అతను గురువారం యూఏఈ నుంచి వచ్చాడు. పరిమితికి మించి బంగారం ఉండటంతో పాటు ఇన్‌వాయిస్‌ లేని వస్తువులు కొనుగోలు చేయడంతో నిర్బంధించినట్లు డీఆర్‌ఐ వర్గాలు తెలిపాయి.

Advertisement
 
Advertisement
Advertisement