CWC 2023: ఇంకా తేల్చుకోలేదు... అహర్నిశలు పనిచేశా

Dravids comment on continuing as head coach of the Indian team - Sakshi

 భారత జట్టు హెడ్‌ కోచ్‌గా కొనసాగడంపై ద్రవిడ్‌ వ్యాఖ్య 

అహ్మదాబాద్‌: టీమిండియా హెడ్‌ కోచ్‌ పదవీ కాలాన్ని పొడిగించుకోవాలా లేదంటే ముగించుకోవాలనే అంశంపై ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదని దిగ్గజ క్రికెటర్‌ రాహుల్‌ ద్రవిడ్‌ అన్నాడు. బీసీసీఐ ఆయనతో కుదుర్చుకున్న రెండేళ్ల కాంట్రాక్టు నవంబర్‌ 19న వరల్డ్‌కప్‌ ఫైనల్‌తో ముగిసింది. టైటిల్‌ పోరులో పరాజయం అనంతరం భారమైన హృదయంతో ద్రవిడ్‌ మీడియా సమావేశానికి వచ్చాడు. నిరాశను దిగమింగి జట్టు ప్రదర్శన, ఫైనల్‌ పరాజయంపై విలేకర్లు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చాడు.

‘కొంతకాలంగా నేను పూర్తిగా ప్రపంచకప్‌పైనే దృష్టి పెట్టాను. జట్టు సన్నద్ధత కోసమే అహర్నిశలు పనిచేశాను. ఇది కాకుండా మరో ఆలోచనేది నేను చేయలేదు. భవిష్యత్‌ ప్రణాళికలపై ఆలోచించడానికి కూడా నేను సమయం వెచ్చించలేదు. నా రెండేళ్ల పదవీకాలంలోని జయాపజయాలు, ఘనతలు, విశేషాలపై విశ్లేషించుకోవడం లేదు’ అని 50 ఏళ్ల ద్రవిడ్‌ వివరించాడు.

‘అన్ని ఫార్మాట్లకు కోచ్‌గా పనిచేయడం చాలా బాగా అనిపించింది. వచ్చే ఏడాది జరిగే టి20 ప్రపంచకప్‌ మార్గదర్శనంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయదల్చుకోలేదు. జట్టు కోసం, ప్రపంచకప్‌ కోసం నాయకుడిగా రోహిత్‌ శర్మ ఎంతో శ్రమించాడు. మున్ముందు భారత హెడ్‌ కోచ్‌గా కొనసాగడంపై ఏ నిర్ణయం తీసుకోని నేను 2027 వన్డే ప్రపంచకప్‌పై ఏం మాట్లాడగలను. అప్పటికి జట్టులో ఎవరు ఉంటారో... ఏవరు పోతారో ఎవరికీ తెలియదు. అలాంటి దానిపై స్పందించడం తగదు’ అని ద్రవిడ్‌ వివరించాడు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

20-11-2023
Nov 20, 2023, 20:26 IST
వన్డే ప్రపంచకప్‌-2023 ఫైనల్లో ఓటమి అనంతరం టీమిండియా స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ హైదరాబాద్‌ చేరుకున్నాడు. ఈ క్రమంలో సోమవారం...
20-11-2023
Nov 20, 2023, 19:52 IST
వన్డే ప్రపంచకప్‌-2023 ఫైనల్లో టీమిండియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో 6 వికెట్ల...
20-11-2023
Nov 20, 2023, 18:35 IST
వన్డే వరల్డ్‌కప్‌-2023 ఫైనల్లో టీమిండియాకు ఊహించని పరాభవం ఎదరైంది. ఈ మెగా టోర్నీలో వరుసగా 10 మ్యాచ్‌ల్లో గెలిచి ఫైనల్‌కు...
20-11-2023
Nov 20, 2023, 17:13 IST
ఒకే ఒక్క మ్యాచ్‌.. కోట్ల మంది భారత  అభిమానుల గుండె పగిలేలా చేసింది. ఒకే ఒక్క మ్యాచ్‌.. సొంత గడ్డపై...
20-11-2023
Nov 20, 2023, 17:12 IST
వన్డే వరల్డ్‌కప్‌-2023 ఫైనల్లో అనూహ్య ఓటమితో టీమిండియాకు నిరాశే మిగిలింది. సొంతగడ్డపై కప్‌ గెలవాలన్న పట్టుదలతో ఆది నుంచి అద్భుతంగా...
20-11-2023
Nov 20, 2023, 16:48 IST
వన్డే వరల్డ్‌కప్‌ 2023లో వరుసగా 10 మ్యాచ్‌ల్లో గెలిచి ఫైనల్‌కు చేరిన భారత్‌.. ఆఖరి మెట్టుపై (ఫైనల్స్‌) బోల్తా పడి...
20-11-2023
Nov 20, 2023, 16:07 IST
వన్డే వరల్డ్‌కప్‌ 2023 ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత ఓటమి నేపథ్యంలో బీసీసీఐపై ఆసీస్‌ మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌...
20-11-2023
Nov 20, 2023, 15:52 IST
ICC WC 2023- Mohammad Shami Post Goes Viral: వన్డే వరల్డ్‌కప్‌-2023 ఫైనల్లో ఓటమిపై టీమిండియా సీనియర్‌ పేసర్‌...
20-11-2023
Nov 20, 2023, 15:44 IST
45 రోజుల పాటు క్రికెట్‌ అభిమానులను ఉర్రూతలూగించిన వన్డే ప్రపంచకప్‌-2023కు ఎండ్‌ కార్డ్‌ పడింది. నవంబర్‌ 19న అహ్మదాబాద్‌ వేదికగా...
20-11-2023
Nov 20, 2023, 14:59 IST
వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్లో ఆస్ట్రేలియా టీమిండియాను ఆరె వికెట్ల తేడాతో ఓడించి, ఆరోసారి జగజ్జేతగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో టాస్‌...
20-11-2023
Nov 20, 2023, 14:22 IST
వన్డే వరల్డ్‌కప్‌ 2023 ఫైనల్లో టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఈ టోర్నీ...
20-11-2023
Nov 20, 2023, 14:02 IST
ఒక్క అడుగు.. ఇంకొక్క అడుగు అంటూ ఊరించిన విజయం ఈసారి కూడా అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. పుష్కరకాలం తర్వాత సొంతగడ్డపై...
20-11-2023
Nov 20, 2023, 13:42 IST
వన్డే వరల్డ్‌కప్‌ 2023 ఫైనల్‌ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన విషయం తెలిసిందే. నిన్న (నవంబర్‌ 19)...
20-11-2023
Nov 20, 2023, 13:21 IST
వన్డే వరల్డ్‌కప్‌ 2023 ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం టీమిండియాకు అతి త్వరలో రానుంది....
20-11-2023
Nov 20, 2023, 13:00 IST
వన్డే వరల్డ్‌కప్‌ 2023 ఫైనల్లో  ఆస్ట్రేలియా టీమిండియాను ఓడించి ఆరోసారి జగజ్జేతగా నిలిచిన విషయం తెలిసిందే. పాట్‌ కమిన్స్‌ కెప్టెన్‌గా...
20-11-2023
Nov 20, 2023, 12:53 IST
వన్డే వరల్డ్‌కప్‌-2023 ఫైనల్లో ఓడిన రోహిత్‌ సేనకు టీమిండియా క్రికెట్‌ దిగ్గజం సునిల్‌ గావస్కర్‌ అండగా నిలిచాడు. ఇప్పటికే ఐదుసార్లు...
20-11-2023
Nov 20, 2023, 12:09 IST
ICC CWC 2023 Final- Rohit Sharma: టీమిండియా ఈసారి కచ్చితంగా ట్రోఫీ గెలుస్తుందనే అభిమానుల ఆశలు అడియాసలయ్యాయి. సొంతగడ్డపై...
20-11-2023
Nov 20, 2023, 11:41 IST
వన్డే వరల్డ్‌కప్‌ 2023 ఫైనల్లో ఆస్ట్రేలియా భారత్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించి, ఆరోసారి జగజ్జేతగా నిలిచిన విషయం తెలిసిందే....
20-11-2023
Nov 20, 2023, 11:25 IST
CWC 2023 Winner Australia: క్రికెట్‌ మెగా సమరానికి తెరపడింది. భారత్‌ వేదికగా అక్టోబరు 5న మొదలైన వన్డే వరల్డ్‌కప్‌...
20-11-2023
Nov 20, 2023, 10:36 IST
CWC 2023 Winner Australia- Pat Cummins Comments: భారత గడ్డపై వన్డే ప్రపంచకప్‌ గెలవడం రెట్టింపు సంతోషాన్నిచ్చిందని ఆస్ట్రేలియా...

మరిన్ని ఫొటోలు



 

Read also in:
Back to Top