IND vs NZ: కివీస్‌తో తొలి టి20.. వెంకటేశ్‌ అయ్యర్‌పై ద్రవిడ్‌ దృష్టి

Dravid Close Attention On Venkatesh Iyer Training Ahead 1st T20 Vs NZ - Sakshi

Dravid Close Attention On Venkatesh Iyer Ahead 1st T20 టి20 ప్రపంచకప్‌ 2021... లో టీమిండియా ప్రదర్శనపై అభిమానులు నిరాశ వ్యక్తం చేశారు. సూపర్‌ 12 దశలోనే టీమిండియా ఇంటిబాట పట్టడం చాలా మందికి నచ్చలేదు. ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా ఫామ్‌లో లేకపోయినప్పటికీ జట్టులో కొనసాగించడంపై అన్ని వైపుల నుంచి విమర్శల  వ్యక్తమయ్యాయి. దీంతో న్యూజిలాండ్‌తో సిరీస్‌కు హార్దిక్‌ పాండ్యాను పక్కనబెట్టిన బీసీసీఐ ఆల్‌రౌండ్‌ జాబితాలో వెంకటేశ్‌ అయ్యర్‌ను జట్టుకు ఎంపిక చేసింది. నవంబర్‌ 17న కివీస్‌తో తొలి టి20 జరగనున్న నేపథ్యంలో టీమిండియా హెడ్‌కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ వెంకటేశ్‌ అయ్యర్‌పై దృష్టి సారించాడు.

చదవండి: ICC 2024-2031 Events Schedule: ఒకటి అమెరికా.. మరొకటి పాకిస్తాన్‌.. మూడు ఇండియాలో

ఈ నేపథ్యంలోనే సోమవారం ప్రాక్టీస్‌ సెషన్‌ సందర్భంగా ద్రవిడ్‌ దాదాపు నాలుగు గంటలపాటు వెంకటేశ్‌ అయ్యర్‌ బ్యాటింగ్‌, బౌలింగ్‌ పరిశీలించాడు. అతని బ్యాటింగ్‌లో టెక్నిక్స్‌.. బౌలింగ్‌లో మెళుకువలు అందించాడు. ద్రవిడ్‌ తీరు చూస్తే.. తొలి టి20లో వెంకటేశ్‌ అయ్యర్‌ కచ్చితంగా ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. జట్టులో మరో ఆల్‌రౌండర్‌గా కనిపిస్తున్న అక్షర్‌ పటేల్‌పై బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ అనే ట్యాగ్‌ ఉంది. కీలకసమయాల్లో అతను ఇన్నింగ్స్‌ ఆడగలడా అనే సందేహాలు ఉన్నాయి. అదే వెంకటేశ్‌ అయ్యర్‌ అయితే అటు పేస్‌ బౌలింగ్‌తో పాటు మెరుపు వేగంతో బ్యాటింగ్‌ చేయగల సామర్థ్యం ఉంది.

ఐపీఎల్‌ 2021లో ఇదే నిరూపితమైంది. కేకేఆర్‌ తరపున ఆడిన అయ్యర్‌ 10 మ్యాచ్‌ల్లో 370 పరుగులతో పాటు.. మూడు వికెట్లు తీసుకున్నాడు. ఇక కోచ్‌గా ఎంపికైన రాహుల్‌ ద్రవిడ్‌ తన లక్ష్యమేంటో వర్చువల్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా బయటపెట్టాడు. '' రానున్న రోజుల్లో టి20 ప్రపంచకప్‌తో పాటు వన్డే వరల్డ్‌కప్‌ రానుంది. ఈ విలువైన సమయాన్ని వృథా చేయాలనుకోవడం లేదు. అవసరమైనన్ని కాంబినేషన్స్‌పై దృష్టి సారిస్తాం. వరల్డ్‌కప్‌ వచ్చేలోపు టీమిండియాను ది బెస్ట్‌ టీమ్‌గా రూపుదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. దానిలో భాగంగానే ఇలాంటి సిరీస్‌లు మాకు ఎంతో ఉపయోగపడుతాయి.'' అని చెప్పుకొచ్చాడు.

చదవండి: ద్రవిడ్‌ బౌలింగ్‌.. రోహిత్‌ శర్మ బ్యాటింగ్‌; వీడియో వైరల్‌ 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top