Ind Vs Nz 1st T20I: Venkatesh Iyer Emotional Speech After Debut For Team India - Sakshi
Sakshi News home page

Venkatesh Iyer: 'నా కల నెరవేరింది'.. వెంకటేశ్‌ అయ్యర్‌ ఎమోషనల్‌

Nov 17 2021 7:20 PM | Updated on Nov 17 2021 9:22 PM

Venkatesh Iyer Emotional Speech After Debut For Team India Vs NZ T20Is - Sakshi

Venkatesh Iyer Emotional After Debut For Team India In T20Is.. కేకేఆర్‌ స్టార్‌ ఆటగాడు వెంకటేశ్‌ అయ్యర్‌ న్యూజిలాండ్‌తో జరుగుతున్న టి20 మ్యాచ్‌లో టీమిండియా తరపున టి20ల్లో 93వ ఆటగాడిగా అరంగేట్రం చేశాడు.  ఈ నేపథ్యంలో మ్యాచ్‌ ప్రారంభానికి ముందు వెంకటేశ్‌ అయ్యర్‌ ఎమోషనల్‌ అయ్యాడు.

''దేశానికి ప్రాతినిధ్యం వహించాలనేది ప్రతీ ఒక్కరికి ఒక కల. ఈరోజుతో నా కల నెరవేరింది. నాకు వచ్చిన ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు ప్రయత్నిస్తా. ఇక కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ పర్యవేక్షణలో ఆడేందుకు మంచి ఉత్సాహంతో ఉన్నా. ఆల్‌రౌండర్‌గా బరిలోకి దిగుతున్న నేను ఏ స్థానంలోనైనా బ్యాటింగ్‌ చేసేందుకు సిద్ధంగా ఉన్నా. ఇక బౌలింగ్‌లోనూ చేయి అందించడానికి ఎదురుచూస్తున్నా. స్వదేశంలో సొంత ప్రేక్షకుల మధ్య ఆడడం కొత్త అనుభూతినిస్తుంది.'' అంటూ చెప్పుకొచ్చాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement