SL Vs WI: కరుణరత్నే సెంచరీ.. భారీ స్కోర్‌ దిశగా శ్రీలంక

Dimuth Karunaratne Slams Unbeaten Ton As Sri Lanka Take Upper Hand On Day 1 - Sakshi

గాలె: వెస్టిండీస్‌తో ఆదివారం మొదలైన తొలి టెస్టు మ్యాచ్‌లో శ్రీలంక క్రికెట్‌ జట్టు భారీ స్కోరు దిశగా సాగుతోంది. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక తొలి ఇన్నింగ్స్‌లో 88 ఓవర్లలో 3 వికెట్లకు 267 పరుగులు సాధించింది. కెప్టెన్, ఓపెనర్‌ దిముత్‌ కరుణరత్నే (265 బంతుల్లో 132 బ్యాటింగ్‌; 13 ఫోర్లు) అజేయ సెంచరీ సాధించాడు.దీంతో ఈ ఏడాది అత్యధిక సెంచరీలు సాధించిన జాబితాలో రెండో ర్యాంక్‌కు చేరుకున్నాడు. 2021లో ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ అత్యధికంగా 6 సెంచరీలు చేశాడు. 

 కాగా మరో ఓపెనర్‌ పథుమ్‌ నిసాంక (140 బంతుల్లో 56; 7 ఫోర్లు)తో కలిసి కరుణరత్నే తొలి వికెట్‌కు 139 పరుగులు జోడించి లంకకు శుభారంభం ఇచ్చాడు. కరుణరత్నే టెస్టు కెరీర్‌లో ఇది 13వ సెంచరీ. నిసాంక అవుటయ్యాక ఒషాడా ఫెర్నాండో (3), మాథ్యూస్‌ (3) తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. అనంతరం కరుణరత్నేతో ధనంజయ డిసిల్వా (77 బంతుల్లో 55 బ్యాటింగ్‌; 5 ఫోర్లు) మరో వికెట్‌ పడకుండా జాగ్రత్తగా ఆడి తొలి రోజు ఆటను ముగించారు.

చదవండి: IND Vs NZ: పాపం హర్షల్ పటేల్.. రాహుల్‌ తర్వాత ఆ చెత్త రికార్డు నమోదు..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top