IPL 2023: ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించిన ధోని.. ఒకే ఒక్కడు! దరిదాపుల్లో ఎవరూ లేరు

Dhoni Becomes 1st Wicket-Keeper To Complete 200 Dismissals In IPL - Sakshi

ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌ చరిత్రలో 200 వికెట్లలో భాగమైన తొలి వికెట్‌ కీపర్‌గా ధోని రికార్డులకెక్కాడు. ఐపీఎల్‌-2023లో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓ అద్భుతమైన క్యాచ్‌తో పాటు రనౌట్‌, స్టంపింగ్‌తో మెరిసిన ధోని ఈ ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఇప్పటివరకు తన ఐపీఎల్‌ కెరీర్‌లో ఎంఎస్‌..  137 క్యాచ్‌లు, 40 స్టంపింగ్‌లు, 23 రనౌట్‌లను చేశాడు. ఇక ధోని తర్వాతి స్థానాల్లో దినేష్ కార్తీక్ (187), ఎబీ డివిలియర్స్ (140) ఉన్నారు.

                                          

ధోని ప్రపంచ రికార్డు..
ఇక ఓవరాల్‌గా టీ20 క్రికెట్‌లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న వికెట్ కీపర్‌గా ధోనీ తొలి స్థానంలో నిలిచాడు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ క్వింటన్ డికాక్‌ రికార్డును ధోనీ బ్రేక్‌చేశాడు. ఈ ఘనత సాధించిన జాబితాలో ధోని 208 క్యాచ్‌లతో అగ్రస్థానంలో ఉండగా..  డికాక్‌(207), దినేశ్‌ కార్తీక్‌(205), కమ్రాన్‌ అక్మల్‌(172) తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.

ఎస్‌ఆర్‌హెచ్‌పై సీఎస్‌కే ఘన విజయం..
ఇక ఈ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌పై  7 వికెట్ల తేడాతో సీఎస్‌కే ఘన విజయం సాధించింది. 135 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్‌కే కేవలం మూడు వికెట్లు కోల్పోయి 18.4 ఓవర్లలో ఛేదించింది. చెన్నై ఓపెనర్‌ డెవాన్‌ కాన్వే 77 పరుగులతో ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్‌ చేశాడు. అంతకుముందు బ్యాటింగ్‌ చేసిన ఎస్‌ఆర్‌హెచ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల కోల్పోయి కేవలం 134 పరుగులు మాత్రమే చేసింది.
చదవండి: #JadejaVsKlassen: క్లాసెన్‌ అడ్డుకున్నా.. ఈసారి ధోని వదల్లేదు!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top