Deaflympics 2022: షేక్‌ జాఫ్రీన్‌కు కాంస్యం | Deaflympics 2022: Sheikh Jaffirin wins bronze medal | Sakshi
Sakshi News home page

Deaflympics 2022: షేక్‌ జాఫ్రీన్‌కు కాంస్యం

May 15 2022 6:42 AM | Updated on May 15 2022 6:46 AM

Deaflympics 2022: Sheikh Jaffirin wins bronze medal - Sakshi

కాక్సియాల్‌ డు సల్‌ (బ్రెజిల్‌): బధిరుల ఒలింపిక్‌ క్రీడల్లో (టెన్నిస్‌) ఆంధ్రప్రదేశ్‌ క్రీడాకారిణి షేక్‌ జాఫ్రీన్‌ కాంస్య పతకం సాధించింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో మూడో స్థానం కోసం జరిగిన పోరులో జాఫ్రీన్‌–పృథ్వీ శేఖర్‌ జోడి 6–1, 6–2తో భారత్‌కే చెందిన భవాని కేడియా – ధనంజయ్‌ దూబే జంటను ఓడించింది.

ఈ జోడీలో భవాని తెలంగాణకు చెందిన ప్లేయర్‌. అంతకు ముందు సెమీ ఫైనల్లో చెక్‌ రిపబ్లిక్‌కు చెందిన బ్లాస్కికోవా–స్మెడెక్‌ చేతిలో 7–5, 5–7, 2–6తో జాఫ్రీన్‌–పృథ్వీ ఓడగా...వెన్‌ లిన్‌–వీ వాంగ్‌ (చైనీస్‌ తైపీ) 6–0, 6–1తో భవాని–ధనంజయ్‌పై గెలుపొందారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement