'ఓడిపోయుండొచ్చు.. కోహ్లి మనసు గెలిచాం'

David Warner Thanks Virat Kohli Giving Jersey As Gift To His Daughter - Sakshi

సిడ్నీ: టీమిండియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో మేం ఓడిపోయుండొచ్చు.. కానీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మనసు మాత్రం గెలుచుకున్నానంటూ ఆసీస్‌ విధ్వంసకర ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ పేర్కొన్నాడు. వార్నర్‌ ఆ మాట ఎందుకన్నాడో తెలియాలంటే ఈ వార్త చదివాల్సిందే. లాక్‌డౌన్‌లో ఈ స్టార్‌ ఆటగాడు తన ఫ్యామిలీతో కలిసి ఇండియన్‌ సినిమా పాటలకు.. తెలుగు సినిమా డైలాగులతో పేరడీలు చేసి అభిమానులను అలరించిన సంగతి తెలిసిందే. టిక్‌టాక్‌లో వార్నర్‌ వీడియో పెట్టాడంటే అది ఇండియన్‌ సినిమాలపైనే చేశాడన్నంతగా పాపులారిటీ సంపాదించాడు.  

తాజాగా డేవిడ్‌ వార్నర్‌ ముద్దుల కూతురు విరాట్‌ కోహ్లి జెర్సీని ధరించి ఫోటోకు ఫోజిచ్చింది. ఈ సందర్భంగా వార్నర్‌ కోహ్లికి థ్యాంక్స్‌ చెబుతూ .. మేం సిరీస్‌ ఓడిపోయామని మాకు తెలుసు.. కానీ ఒక్కసారి ఇక్కడ నవ్వుతున్న చిట్టితల్లిని చూస్తే ఆ బాధనంతా మరిచిపోతాం. విరాట్‌ నీ జెర్సీ నా కూతురుకి పంపినందుకు చాలా థ్యాంక్స్‌. నీ జెర్సీ ధరించి నా చిట్టితల్లి మురిసిపోతుంది. అంటూ  క్యాప్షన్‌ జతచేశాడు. కాగా ఆసీస్‌ పర్యటనలో బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీని టీమిండియా 2-1 తేడాతో వరుసగా రెండోసారి గెలచుకొని చరిత్ర సృష్టించింది. చివరి టెస్టు జరిగిన గబ్బా మైదానంలో ఆసీస్‌ విధించిన 324 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించి ఆసీస్‌ 32 ఏళ్ల జైత్రయాత్రకు చెక్‌ పెట్టింది. కాగా ఆసీస్‌ పర్యటన ముగించుకొని స్వదేశానికి చేరుకున్న టీమిండియా ఫిబ్రవరి 5వ తేదీ నుంచి ఇంగ్లండ్‌తో తొలి టెస్టు ఆడనుంది. మరోవైపు ఆస్ట్రేలియా సిరీస్‌ ఆడేందుకు న్యూజిలాండ్‌లో పర్యటించనుంది. చదవండి: 40 ఏళ్లలో ఇదే అద్భుతమైన గెలుపు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top