Rishabh Pant: బ్రదర్‌ అంటూ వార్నర్‌ భావోద్వేగం.. ఫొటో వైరల్‌

David Warner Heartfelt Post For Brother Rishabh Pant Goes Viral - Sakshi

David Warner- Rishabh Pant: టీమిండియా క్రికెటర్‌ రిషభ్‌ పంత్‌ను ఉద్దేశించి ఆస్ట్రేలియా స్టార్‌ డేవిడ్‌ వార్నర్‌ భావోద్వేగపూరిత సందేశం పోస్ట్‌ చేశాడు. ‘‘ నీకు మేమంతా ఉన్నాం బ్రదర్‌’’ అంటూ పంత్‌పై అనురాగాన్ని చాటుకున్నాడు. కాగా భారత స్టార్‌ ప్లేయర్‌ రిషభ్‌ పంత్‌.. డిసెంబరు 30న ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.

ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్‌కు వెళ్తున్న సమయంలో అతడు ప్రయాణిస్తున్న కారుకు యాక్సిడెంట్‌ జరగగా.. అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే, ఈ ఘటనలో పంత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంలో ఉత్తరాఖండ్‌లో చికిత్స పూర్తైన తర్వాత ముంబైకి ఎయిర్‌లిఫ్ట్‌ చేసింది బీసీసీఐ.

ప్రస్తుతం అతడు కోకిలాబెన్‌ ధీరూబాయి అంబానీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో పంత్‌ త్వరగా కోలుకోవాలంటూ అతడి మిత్రులు, అభిమానులు, శ్రేయోభిలాషులు కోరుకుంటున్నారు. ఈ క్రమంలో పంత్‌ ‘సహచర ఆటగాడు’ వార్నర్‌ సైతం.. ‘‘త్వరగా కోలుకో బ్రదర్‌’’’ అంటూ అతడితో దిగిన ఫొటోను ఇన్‌స్టాలో షేర్‌ చేశాడు.

ప్రస్తుతం ఈ ఫొటో వైరల్‌ అవుతోంది. కాగా ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో పంత్‌, వార్నర్‌ ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడుతున్న విషయం తెలిసిందే. గతేడాది వార్నర్‌ను ఢిల్లీ కొనుగోలు చేయగా.. పంత్‌ కెప్టెన్సీలో అతడు మ్యాచ్‌లు ఆడాడు. ఇక ప్రమాదం బారిన పడ్డ పంత్‌ కొన్ని రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాల్సిన నేపథ్యంలో అతడి స్థానంలో వార్నర్‌ ఢిల్లీ జట్టు పగ్గాలు చేపట్టనున్నట్లు సమాచారం. 

చదవండి: IND vs SL: శ్రీలంకతో మూడో టీ20.. అర్ష్‌దీప్‌, గిల్‌కు నో ఛాన్స్‌! మరో పేసర్‌ ఎంట్రీ
Hardik Pandya: ఓడినా పర్లేదా?! కోహ్లి, రోహిత్‌.. ఇప్పుడు హార్దిక్‌ ఎందుకిలా చేస్తున్నారు? డీకే స్ట్రాంగ్‌ రిప్లై

మరిన్ని వార్తలు :

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top