అభిమానుల‌కు డేవిడ్ వార్న‌ర్‌ స‌వాల్ | David Warner Challenge His Fans To Find His Getup Through Instagram | Sakshi
Sakshi News home page

అభిమానుల‌కు డేవిడ్ వార్న‌ర్‌ స‌వాల్

Sep 3 2020 6:53 PM | Updated on Sep 3 2020 7:25 PM

David Warner Challenge His Fans To Find His Getup Through Instagram - Sakshi

ఆస్ట్రేలియా స్టార్ ఆట‌గాడు డేవిడ్ వార్న‌ర్‌కు భార‌తీయ సినిమాలంటే ఎన‌లేని పిచ్చి అనుకుంటా. అందునా తెలుగు సినిమాల ప్ర‌భావం వార్న‌ర్‌పై గ‌ట్టిగానే ప‌డింది. క‌రోనా మొద‌లైన‌ప్ప‌టినుంచి టిక్‌టాక్‌లో త బిజీ అయిన వార్న‌ర్ డైలాగ్స్‌, డ్యాన్సల‌తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా తెలుగు సినిమాల నుంచి పాట‌లు, డైలాగ్స్ తీసుకొని త‌న‌దైన డైలాగ్ డెలివ‌రీతో న‌వ్వులు పూయించాడు. తాను ఒక్క‌డే కాకుండా త‌న ఫ్యామిలీని కూడా డ్యాన్స్‌లతో ప‌రిచ‌యం చేశాడు. ఇండియాలో టిక్‌టాక్ బ్యాన్ అయిన‌ప్ప‌టినుంచి వార్న‌ర్ హ‌వా కాస్త త‌గ్గిన‌ప్ప‌టికి తాజాగా మ‌రోసారి త‌న స‌ర‌దాతో ఇన్‌స్టా ద్వారా మ‌న‌ముందుకొచ్చాడు. తాజాగా  త‌న అభిమానుల‌కు ఒక‌ స‌వాల్ విసిరాడు.

'నేను  చెప్పిన డైలాగ్ ఏ హీరోదో ... ఎవ‌రి వేషంలో ఉన్నానో చెప్పాలి.. నేను బెట్ వేయ‌గ‌ల‌ను.. మీరు చెప్ప‌లేర‌ని' అంటూ పేర్కొన్నాడు. అయితే వీడియోలో ఇమిటేట్ చేసింది వేరెవరినో కాదు.. టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబును. మ‌హేష్ న‌టించిన ఇండ‌స్ట్రీ హిట్ పోకిరి సినిమాలో మ‌హేష్ గెట‌ఫ్‌ను దించేశాడు. కేవ‌లం ఫేస్ మార్ఫింగ్‌ను మాత్ర‌మే చేసిన వార్న‌ర్‌ను తెలుగు అభిమానుల‌తో పాటు సూప‌ర్‌స్టార్ క్రేజ్ తెలిసిన ప్ర‌తీ అభిమాని.. వార్న‌ర్ వేసిన వేషాన్ని ఈజీగా గుర్తుప‌డ‌తారు. అయితే మ‌హేష్ బాబు పేరు తెలియ‌ని వారికి మాత్రం వార్న‌ర్ విసిరిన స‌వాల్ కొంచెం క‌ష్టంగానే ఉంటుంది. ఏదైతేనేం త‌న క్రేజీ ఐడియాతో వార్న‌ర్ మ‌రోసారి వార్త‌ల్లో నిలిచాడు. మా తెలుగు హీరోలంటే వార్న‌ర్‌కు ఎన‌లేనంత అభిమానం అంటూ నెటిజ‌న్లు కామెంట్లు పెడుతున్నారు.  (చదవండి : జ‌డ్డూ బాయ్.. వాట్ ఏ స్ట‌న్నింగ్ క్యాచ్)

Advertisement
 
Advertisement
Advertisement