మూడు ఫార్మాట్లలోనూ అతడొక అద్బుతం.. నిజంగా మాకు ఇది: ఆసీస్‌ హెడ్‌ కోచ్‌ | David Warner Australias greatest all-format player: Andrew McDonald | Sakshi
Sakshi News home page

మూడు ఫార్మాట్లలోనూ అతడొక అద్బుతం.. నిజంగా మాకు ఇది: ఆసీస్‌ హెడ్‌ కోచ్‌

Dec 31 2023 1:14 PM | Updated on Dec 31 2023 2:17 PM

David Warner Australias greatest all-format player: Andrew McDonald  - Sakshi

ఆస్ట్రేలియా స్టార్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ తన కెరీర్‌లో చివరి టెస్టు మ్యాచ్‌ ఆడేందుకు సిద్దమయ్యాడు. పాకిస్తాన్‌తో జరగనున్న మూడో టెస్టు అనంతరం టెస్టు క్రికెట్‌కు వార్నర్‌ విడ్కోలు పలకనున్నాడు. ఇప్పటికే తన నిర్ణయాన్ని వార్నర్‌ వెల్లడించిన సంగతి తెలిసిందే. . జనవరి 3 నుంచి సిడ్నీ వేదికగా జరిగే మూడో టెస్టు జరగనుంది.

తన సొంత మైదానంలో అద్బుతప్రదర్శన కనబరిచి తన టెస్టు కెరీర్‌కు ముగింపు పలకాలని వార్నర్‌ భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలో వార్నర్‌పై ఆసీస్‌ ప్రధాన కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ ప్రశంసల వర్షం కురిపించాడు. మూడు ఫార్మాట్లలో ఆసీస్‌కు ప్రాతినిథ్యం వహించిన అత్యుత్తమ ఆటగాళ్లలో వార్నర్‌ ఒకడని మెక్‌డొనాల్డ్ కొనియాడాడు.

డేవిడ్‌ వార్నర్‌ ఒక అద్బుతమైన ఆటగాడు. అతొడక ఆల్‌ఫార్మాట్‌ ప్లేయర్‌. మూడు ఫార్మాట్లలోనూ జట్టుకు ఎన్నో అద్భుతమైన విజయాలు అందించాడు. అటువంటి ఆటగాడు ఇప్పుడు టెస్టు క్రికెట్‌ నుంచి తప్పుకోబోతున్నాడు. ఇది నిజంగా ఆస్ట్రేలియా క్రికెట్‌కు కోలుకోలేని దెబ్బ. గత కొంతకాలం నుంచి వార్నర్‌ టెస్టు క్రికెట్‌ ఫామ్‌పై చాలా మంది విమర్శలు చేస్తున్నారని నాకు తెలుసు. 

కానీ ఒక జట్టుగా మేము అతడిపై నమ్మకం ఉంచాము. అందుకే పాకిస్తాన్‌తో సిరీస్‌కు ఎంపిక చేశాము. తొలి టెస్టు మ్యాచ్‌లోనే తనను తాను మరోసారి నిరూపించుకున్నాడు. ఏదైమైనప్పటికి అతడి స్థానాన్ని భర్తీ చేయడం మాకు చాలా కష్టం.

టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఓపెనర్‌గా వార్నర్‌ కొనసాగుతున్నాడు. మేము మూడో మ్యాచ్‌లోనూ విజయం సాధించి సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసి వార్నర్‌కు అంకితమివ్వాలని భావిస్తున్నాము అని క్రికెట్‌ ఆస్ట్రేలియా.కామ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మెక్‌డొనాల్డ్ పేర్కొన్నాడు.
చదవండి: #Saumy Pandey: ఐపీఎల్‌ వేలంలో ఎవరూ కొనలేదు.. అక్కడ మాత్రం చెలరేగాడు! 6 వికెట్లతో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement