
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్లు వార్నర్, కమిన్స్, హేజల్‌వుడ్ ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉంది. ఇప్పటి వరకు ఐపీఎల్ టోర్నీ తేదీలను అధికారికంగా ప్రకటించకపోయినా మార్చి చివరి వారంలో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నా యి. అయితే ఆసీస్ ఆటగాళ్లు ఏప్రిల్ 6 తర్వాతే ఐపీఎల్‌లో ఆయా జట్లతో కలుస్తారు. నిజానికి ఈ ముగ్గురు ఆటగాళ్లు పాకిస్తాన్‌తో జరిగే మూడు టెస్టుల సిరీస్‌కు (మార్చి 25 వరకు) మాత్రమే ఎంపికయ్యారు.
ఆ తర్వాత ఏప్రిల్ 6 వరకు జరిగే వన్డే సిరీస్, ఏకైక టి20 నుంచి వీరికి విశ్రాంతినిచ్చారు.అయితే క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) నిబంధనల ప్రకారం ఆసీస్ టీమ్ ఒక అంతర్జాతీయ సిరీస్‌లో ఆడుతున్న సమయంలో మరోవైపు కాంట్రాక్ట్ ఆటగాళ్లెవరూ ఐపీఎల్ ఆడటానికి వీల్లేదు. దాంతో వీరు టెస్టు సిరీస్ ముగిసిన తర్వాత స్వదేశం వెళ్లిపోతారు.