IPL 2025: వాషింగ్టన్‌ సుందర్‌ కోసం ఎగబడుతున్న ఫ్రాంఛైజీలు | CSK, MI, GT HAVE SHOWN HUGE INTEREST IN WASHINGTON SUNDAR FOR IPL 2025 | Sakshi
Sakshi News home page

IPL 2025: వాషింగ్టన్‌ సుందర్‌ కోసం ఎగబడుతున్న ఫ్రాంఛైజీలు

Oct 29 2024 12:58 PM | Updated on Oct 29 2024 2:17 PM

CSK, MI, GT HAVE SHOWN HUGE INTEREST IN WASHINGTON SUNDAR FOR IPL 2025

న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌లో 11 వికెట్లు పడగొట్టి టెస్ట్‌ క్రికెట్‌లోకి ఘనంగా రీఎంట్రీ ఇచ్చిన టీమిండియా స్పిన్‌ ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ ప్రస్తుతం టాక్‌ ఆఫ్‌ ద క్రికెట్‌ సర్కిల్స్‌గా మారాడు. ఐపీఎల్‌ 2025 మెగా వేలం నేపథ్యంలో ఈ చెన్నై చిన్నోడిని దక్కించుకునేందుకు ఫ్రాంచైజీలు ఎగబడుతున్నట్లు తెలుస్తుంది. సుందర్‌ కోసం మూడు ఫ్రాంచైజీలు పక్కా ప్రణాళికలు రచిస్తున్నట్లు సమాచారం. 

గుజరాత్‌ టైటాన్స్‌, ముంబై ఇండియన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఫ్రాంచైజీలు సుందర్‌పై ఎంత ధర అయినా వెచ్చించేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తుంది. స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ కావడం​, అందులోనూ ఇటీవల సూపర్‌ ఫామ్‌లో ఉండటం సుందర్‌కు ప్లస్‌ పాయింట్‌గా పరిగణించబడుతుంది. ఐపీఎల్‌ వర్గాల సమాచారాం మేరకు సుందర్‌కు 10 కోట్లకు పైనే శాలరీ లభించవచ్చని అంచనా. సుందర్‌ను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సైతం వదులుకునే పరిస్థితి లేదు. ఎస్‌ఆర్‌హెచ్‌ సుందర్‌ను డైరెక్ట్‌గా రిటైన్‌ చేసుకోలేకపోయినా ఆర్‌టీఎమ్‌ కార్డు ద్వారా సొంతం చేసుకునే అవకాశం ఉంది.

కాగా, అన్ని ఫ్రాంచైజీలు తమతమ రిటెన్షన్‌ జాబితాలను సమర్పించడానికి అక్టోబర్‌ 31 చివరి తేదీ అన్న విషయం తెలిసిందే. ప్రస్తుతమున్న సమాచారం మేరకు ఒక్కో ఫ్రాంచైజీ ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకోవచ్చు. ఇందులో గరిష్టంగా అయిదుగురు క్యాప్డ్ ప్లేయర్లు, ఇద్దరు అన్‌క్యాప్డ్ ప్లేయర్లకు అవకాశం ఉంటుంది. రిటైన్ చేసుకునే క్యాప్డ్‌ ప్లేయర్లకు ఛాయిస్‌ ప్రకారం​ వరుసగా 18, 14, 11 కోట్ల శాలరీ ఇవ్వాల్సి ఉంటుంది. రిటైన్‌ చేసుకునే అన్‌క్యాప్డ్ ప్లేయర్‌కు 4 కోట్లు పారితోషికం చెల్లించాల్సి ఉంటుంది. ఐపీఎల్‌-2025 వేలం నవంబర్‌ 25 లేదా 26 తేదీల్లో రియాద్‌లో జరగవచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement