చరిత్ర సృష్టించిన రొనాల్డో.. ఆ జాబితాలో నంబర్‌ వన్‌ స్థానం

Cristiano Ronaldo Equals Ali Daei Record For Most International Goals In Mens Football - Sakshi

బుడాపెస్ట్‌: యూరో కప్‌ 2020 ఫుట్‌బాల్ టోర్నీలో భాగంగా ఫ్రాన్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో పోర్చుగ‌ల్ స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో ప్రపంచ రికార్డును సమం చేశాడు. ఇప్పటి వరకు అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్‌ రికార్డు ఇరాన్‌కు చెందిన అలీ డేయీ(109 గోల్స్‌) పేరిట ఉండగా, బుధ‌వారం జరిగిన మ్యాచ్‌లో రొనాల్డో(109) రెండు గోల్స్‌ సాధించడంతో అత్యధిక గోల్స్‌ సాధించిన ఆటగాళ్ల జాబితాలో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచాడు. కాగా, అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో చరిత్ర సృష్టించేందుకు రొనాల్డో కేవలం ఒక్క గోల్‌ దూరంలో ఉన్నాడు. ఈ జాబితాలో భారత ఫుట్‌బాల్‌ కెప్టెన్‌ సునీల్‌ ఛెత్రీ 74 గోల్స్‌తో 11వ స్థానంలో ఉండగా, అర్జెంటీనా స్టార్‌ ఫుట్‌బాలర్‌ మెస్సీ 73 గోల్స్‌తో 12వ స్థానంలో నిలిచాడు. 

ఇదిలా ఉంటే, ఫ్రాన్స్‌తో జరిగిన మ్యాచ్ డ్రా కావ‌డంతో పోర్చుగ‌ల్ నాకౌట్‌ దశకు ప్ర‌వేశించింది. టోర్నీలో పోర్చుగ‌ల్ మ‌రో మ్యాచ్ ఆడాల్సి ఉండటంతో రొనాల్డో చరిత్ర సృష్టించేందుకు అవ‌కాశాలు పుష్కలంగా ఉన్నాయి. కాగా, ప్రస్తుత టోర్నీలో మూడు మ్యాచ్‌ల్లో ఐదు గోల్స్‌తో టాప్ స్కోర‌ర్‌గా నిలిచిన రొనాల్డో.. టోర్నీ చరిత్రలో అత్యధిక గోల్స్‌ సాధించిన ఆటగాడు కూడా కావడం విశేషం. యూరో కప్‌లో అతను మొత్తం 14 గోల్స్‌ చేసి ఎవ‌రికీ అంద‌నంత ఎత్తులో ఉన్నాడు. 
చదవండి: ICC Rankings: టాప్‌ ర్యాంక్‌కు దూసుకెళ్లిన జడేజా

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top