FIFA WC 2022: చరిత్ర సృష్టించిన రొనాల్డో.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా

Cristiano Ronaldo becomes first Player to score in FIVE consecutive World Cups - Sakshi

FIFA World Cup 2022: పోర్చ్‌గల్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో అరుదైన ఘనత సాధించాడు. వరుసగా ఐదు వరల్డ్ కప్ టోర్నీల్లో గోల్ సాధించిన మొట్టమొదటి ఆటగాడిగా రొనాల్డో రికార్డు సృష్టించాడు. ఫిఫా వరల్డ్‌కప్‌-2022 మెగా ఈవెంట్‌లో భాగంగా గురువారం ఘనాతో జరిగిన మ్యాచ్‌లో పెనాల్టీ కిక్‌ ద్వారా గోల్‌ సాధించిన రొనాల్డో ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.

రొనాల్డో 2006 ఫిఫా వరల్డ్ కప్ నుంచి వరుసగా, 2010, 2014, 2018, 2022లో గోల్స్‌ సాధించాడు. కాగా ప్రపంచకప్‌ టోర్నీల్లో ఇది అతడికి ఎనిమిదో గోల్‌ కావడం గమనార్హం. అదే విధంగా మరో రికార్డును కూడా రొనాల్డో తన ఖాతాలో వేసుకున్నాడు.

అత్యధిక అంతర్జాతీయ గోల్‌లను సాధించిన ఆటగాడిగా రొనాల్డో(118) నిలిచాడు. అదే విధంగా ఏ క్లబ్‌తోనూ సంబంధం లేకుండా కెప్టెన్‌గా ఫిపా వరల్డ్‌ కప్‌లో పాల్గొన్న రెండవ ప్లేయర్‌గా  నిలిచాడు. ఇక మ్యాచ్‌లో ఘనాపై 3-2 తేడాతో పోర్చుగల్ ఘన విజయం సాధించింది.
చదవండిFIFA WC 2022: పాపం.. గోల్‌ కొట్టినా సెలబ్రేట్‌ చేసుకోలేక

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top