తండ్రైన టీమిండియా క్రికెటర్‌.. మా కుమారుడు అంటూ ఎమోషనల్‌..! కంగ్రాట్స్‌ భయ్యా!

Cricketer Mohit Sharma His Wife Blessed With Baby Boy Shares Photo - Sakshi

టీమిండియా క్రికెటర్‌ మోహిత్‌ శర్మ తండ్రయ్యాడు. అతడి భార్య శ్వేతా శర్మ సోమవారం పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు మోహిత్‌. ఈ సందర్భంగా పాపాయి చేతిని తమ చేతుల్లోకి తీసుకున్న ఫొటోను షేర్‌ చేశాడు. 

‘‘ఈ ప్రపంచంలోకి నీకు స్వాగతం. మా హృదయాలు సంతోషాలతో నిండిపోయాయి. మా కుమారుడి రాకను తెలియజేసేందుకు మేమెంతో గర్విస్తున్నాం’’అంటూ భావోద్వేగ క్యాప్షన్‌ జతచేశాడు. ఈ క్రమంలో సెలబ్రిటీలు, నెటిజన్ల నుంచి మోహిత్‌ శర్మ దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 

కాగా హర్యానాకు చెందిన మోహిత్‌ శర్మ టీమిండియా తరఫున ఇప్పటి వరకు 26 వన్డేలు, 8 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. మొత్తంగా 37 వికెట్లు పడగొట్టాడు. చివరిసారిగా 2015లో భారత్‌ తరఫున అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడాడు. ఇక ఐపీఎల్‌లో మొత్తంగా 86 మ్యాచ్‌లు ఆడిన ఈ సీనియర్‌ బౌలర్‌.. 92 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక వ్యక్తిగత విషయానికొస్తే.. 2016లో శ్వేతను పెళ్లాడాడు మోహిత్‌ శర్మ. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వీరు తల్లిదండ్రులుగా ప్రమోషన్‌ పొందారు.

చదవండి: IPL 2022 Auction: మెగా వేలానికి తేదీలు ఖరారు చేసిన గవర్నింగ్‌ కౌన్సిల్‌... సీవీసీకి గ్రీన్‌ సిగ్నల్‌!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top