వెస్టిండీస్ క్రికెట్ జట్టు త్వరలో భారత పర్యటనకు రానుంది. ఈ పర్యటనలో భాగంగా మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. ఫిబ్రవరి 6న భారత్- వెస్టిండీస్ మధ్య తొలి వన్డే జరగనుంది. ఇప్పటికే వన్డే సిరీస్ కోసం విండీస్ జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. అయితే ఈ సిరీస్‌కు ఎంపిక చేసిన వెస్టిండీస్ జట్టులో కొంత మంది సీనియర్ ఆటగాళ్లతో కెప్టెన్ కీరన్ పొలార్డ్‌కి విభేదాలు తలెత్తినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆల్‌రౌండర్ ఓడెన్ స్మిత్ విషయంలో అతడు వివక్షాపూరితంగా వ్యవహరించినట్లు స్థానిక మీడియాలో సంచలన కథనాలు వెలువడ్డాయి.
ఈ క్రమంలో ఈ వార్తలపై క్రికెట్ వెస్టిండీస్ స్పందించింది. వెస్టిండీస్ జట్టులో విభేదాలు చెలరేగాయి అంటూ వస్తున్న వార్తలను కొట్టిపారేసింది. విండీస్ జట్టులో ఎటువంటి విభేదాలు లేవని, ఆటగాళ్లు అందరూ బాగానే ఉన్నారని క్రికెట్ వెస్టిండీస్ పేర్కొంది. కెప్టెన్ పొలార్డ్ విశ్వసనీయతని దెబ్బతీసేందుకు ఇటువంటి రూమర్స్ సృష్టించారని సీడబ్ల్యూఐ ప్రెసిడెంట్ రిక్కీ స్టేరిట్ తెలిపాడు.కాగా విండీస్ జట్టు స్వదేశంలో ఇంగ్లండ్‌తో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తలపడుతోంది. 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1తో విండీస్ అధిక్యంలో ఉంది.
చదవండి: India Captain: భవిష్యత్తు కెప్టెనా... అసలు అతడిలో ఏ స్కిల్ చూసి ఎంపిక చేశారు: సెలక్టర్లపై మండిపడ్డ మనోజ్ తివారి
IPL 2022 Mega Auction: వేలంలో పేరు నమోదు చేసుకున్న శ్రీశాంత్.. ధర ఎంతో తెలుసా?

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
