ఆస్ట్రేలియా పురుషుల జట్టు హెడ్ కోచ్‌గా ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌కు పొడిగింపు ఇచ్చారు. 2027 సీజన్ ముగిసేదాకా మెక్‌డొనాల్డే హెడ్ కోచ్‌గా కొనసాగుతాడని క్రికెట్ ఆ్రస్టేలియా (సీఏ) బుధవారం ప్రకటించింది. అంటే దక్షిణాఫ్రికాలో జరిగే వన్డే ప్రపంచకప్ దాకా మెక్‌డొనాల్డ్ ఆసీస్ జట్టుతో ఉంటాడు. జస్టిన్ లాంగర్ తప్పుకోవడంతో 2022లో మెక్‌డొనాల్డ్‌కు కోచింగ్ బాధ్యతలు అప్పగించారు.
డబ్ల్యూటీసీతో పాటు వన్డే వరల్డ్ కప్
మెక్‌డొనాల్డ్ కోచింగ్‌లోనే ఆస్ట్రేలియా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) సాధించింది. భారత్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌ను సొంతం చేసుకుంది. ఇంగ్లండ్‌లో ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌నూ కైవసం చేసుకుంది. వన్డే ప్రపంచకప్‌ను నిలబెట్టుకునే లక్ష్యంతోనే ఆయన పదవీకాలాన్ని పొడిగించినట్లు తెలిసింది.
అందుకే పొడిగించాం
ఈ లోపే వచ్చే ఏడాది చాంపియన్స్ ట్రోఫీ కూడా ఉండటంతో మెక్‌డొనాల్డ్‌పై సీఏ మరోసారి నమ్మకం ఉంచింది. హెడ్ కోచ్‌గా మెక్‌డొనాల్డ్ ఇప్పటికే నిరూపించుకున్నాడని క్రికెట్ ఆస్ట్రేలియా సీఈఓ నిక్ హాక్లీ అన్నారు.
జట్టు నిలకడైన విజయాల్లో మెక్‌డొనాల్డ్ కీలకపాత్ర పోషిస్తున్నాడని, దీంతో కోచింగ్ బృందాన్ని మరింత పటిష్ట పరిచేందుకే పొడిగింపు ఇచ్చామని హాక్లీ తెలిపారు. ఇక.. తనకు లభించిన పొడిగింపుపై హర్షం వ్యక్తం చేసిన మెక్‌డొనాల్డ్.. తనపై ఉంచిన నమ్మకాన్ని నిబద్ధతతో పూర్తి చేస్తానని చెప్పారు.
చదవండి: IPL 2025: రిషభ్ పంత్‌ను వదులుకున్న ఢిల్లీ క్యాపిటల్స్
Comments
Please login to add a commentAdd a comment