హైదరాబాద్‌ ఆటగాడి విధ్వంసం.. 33 ఫోర్లతో డబుల్‌ సెంచరీ | Cooch Behar Trophy 2024: Hyderabad Opener Aaron Jarz Smashes Double Century, Check Out More Insights Inside | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ ఆటగాడి విధ్వంసం.. 33 ఫోర్లతో డబుల్‌ సెంచరీ

Nov 8 2024 9:29 AM | Updated on Nov 8 2024 11:40 AM

Cooch Behar Trophy 2024: Hyderabad Opener aaron jarz smashes Double century

సాక్షి, హైదరాబాద్‌: గోవా జట్టుతో జరుగుతున్న కూచ్‌ బెహార్‌ ట్రోఫీ అండర్‌–19 క్రికెట్‌ టోర్నీ మ్యాచ్‌లో హైదరాబాద్‌ జట్టు పరుగుల వరద పారించింది. సికింద్రాబాద్‌ జింఖానా మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో హైదరాబాద్‌ జట్టు తమ తొలి ఇన్నింగ్స్‌ను 136 ఓవర్లలో 9 వికెట్లకు 604 పరుగులు చేసి డిక్లేర్‌ చేసింది. ఓపెనర్‌ ఆరన్‌ జార్జి (258 బంతుల్లో 219; 33 ఫోర్లు) డబుల్‌ సెంచరీతో మెరిశాడు.

వన్‌డౌన్‌ బ్యాటర్‌ చెప్యాలా సిద్ధార్థ్‌ రావు (195 బంతుల్లో 101; 15 ఫోర్లు), ఎనిమిదో నంబర్‌ బ్యాటర్‌ యశ్‌వీర్‌ (113 బంతుల్లో 111 నాటౌట్‌; 10 ఫోర్లు, 4 సిక్స్‌లు) సెంచరీలు సాధించారు. సీహెచ్‌ నిశాంత్‌ రెడ్డి (66; 4 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధ సెంచరీ చేశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన గోవా జట్టు ఆట ముగిసే సమయానికి 39 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 139 పరుగులు సాధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement