Chamundeswaranath: నిఖత్ జరీన్‌కు బహుమతిగా కారు

ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌గా నిలిచిన నిఖత్ జరీన్‌కు తెలంగాణ బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు వి.చాముండేశ్వరీనాథ్ ప్రోత్సాహక బహుమతిగా కారును ప్రకటించారు. ఆదివారం హైదరాబాద్‌లో భారత బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ చేతుల మీదుగా దీనిని అందజేశారు.
కాగా తెలంగాణ మహిళా బాక్సర్ నిఖత్ జరీన్ ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. 52 కేజీల ఫ్లయ్ వెయిట్ విభాగంలో ఆమె జగజ్జేతగా నిలిచింది. ఇస్తాంబుల్‌లో జరిగిన ఫైనల్లో థాయ్‌లాండ్ బాక్సర్ జిత్‌పాంగ్ జుతమాస్‌తో జరిగిన టైటిల్ పోరులో 5–0తో గెలుపొంది ‘స్వర్ణ’ చరిత్ర లిఖించింది. యావత్ భారతావని పులకించేలా ‘పసిడి పంచ్’తో మెరిసింది.
చదవండి 👇
IPL 2022 Prize Money: ఐపీఎల్ ‘విజేతలు’.. ఎవరెవరి ప్రైజ్‌మనీ ఎంతంటే!
IPL 2022 Final - Hardik Pandya: శెభాష్.. సీజన్ ఆరంభానికి ముందు సవాళ్లు.. ఇప్పుడు కెప్టెన్‌గా అరుదైన రికార్డు!
మరిన్ని వార్తలు