IPL 2022 Final - Hardik Pandya: శెభాష్‌.. సీజన్‌ ఆరంభానికి ముందు సవాళ్లు.. ఇప్పుడు కెప్టెన్‌గా అరుదైన రికార్డు!

IPL 2022 Winner Gujarat Titans: Hardik Pandya Record As 4th Captain - Sakshi

కెప్టెన్‌గా హార్దిక్‌ పాండ్యా అరుదైన రికార్డు

IPL 2022- Hardik Pandya Record: అరంగేట్రంలోనే అదిరిపోయే ప్రదర్శనతో గుజరాత్‌ టైటాన్స్‌ ఐపీఎల్‌-2022 విజేతగా నిలిచింది. సీజన్‌ ఆరంభం నుంచి సమిష్టి విజయాలతో టేబుల్‌ టాపర్‌గా నిలిచి.. నాకౌట్‌ దశలోనూ సత్తా చాటి ట్రోఫీని ముద్దాడింది. మెగా ఫైనల్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించి టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఇక ఐపీఎల్‌ తాజా ఎడిషన్‌కు ముందు హార్దిక్‌ పాండ్యా ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.

ఐపీఎల్‌-2021లో ఆల్‌రౌండర్‌గా రాణించలేకపోవడం, టీ20 ప్రపంచకప్‌-2021 టోర్నీలో వైఫల్యం సహా ఫిట్‌నెస్‌ సమస్యలతో జట్టుకు దూరం కావడం వంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఇలాంటి పరిస్థితుల్లోనూ ‘సీవీసీ క్యాపిటల్స్‌’  అతడిని నమ్మి గుజరాత్‌ కెప్టెన్‌గా అతడికి అవకాశం ఇచ్చింది. యాజమాన్యం నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు హర్దిక్‌.

అంతకు ముందు కెప్టెన్సీ అనుభవం లేకపోయినా సమర్థవంతంగా జట్టును ముందుకు నడిపించి తొలి సీజన్‌లోనే టైటిల్‌ అందించాడు. ఈ క్రమంలో హార్దిక్‌ పాండ్యా అరుదైన రికార్డు నమోదు చేశాడు. ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) టైటిల్‌ గెలిచిన నాలుగో భారతీయ కెప్టెన్‌గా అతడు గుర్తింపు పొందాడు.

గతంలో ఎంఎస్‌ ధోని (4 సార్లు–చెన్నై సూపర్‌ కింగ్స్‌; 2010, 2011, 2018, 2021), గౌతమ్‌ గంభీర్‌ (2 సార్లు–కోల్‌కతా నైట్‌రైడర్స్‌; 2012, 2014), రోహిత్‌ శర్మ (5 సార్లు–ముంబై ఇండియన్స్‌; 2013, 2015, 2017, 2019, 2020) ఈ ఘనత సాధించారు. ఇక గుజరాత్‌ గెలవడంలో సారథిగానే కాకుండా ఆల్‌రౌండర్‌గానూ హార్దిక్‌ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

చదవండి 👇
Hardik Pandya: సాహో హార్దిక్‌.. గతంలో కెప్టెన్సీ అనుభవం లేదు..  అయినా
ఐపీఎల్‌ చరిత్రలో యజ్వేంద్ర చహల్‌ సరికొత్త రికార్డు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

30-05-2022
May 30, 2022, 09:58 IST
ఐపీఎల్‌-2022కు హాజరైన ప్రేక్షకులెందరో తెలుసా?
30-05-2022
May 30, 2022, 09:04 IST
ఐపీఎల్‌-2022: విజేతలు ఎవరు? ఎవరెవరు ఎంత గెల్చుకున్నారు? 
30-05-2022
May 30, 2022, 08:09 IST
‘విజయం అయితే మీది... ఓటమి ఎదురైతే అది నాది’... ఐపీఎల్‌లో తొలిసారి బరిలోకి దిగిన గుజరాత్‌ టైటాన్స్‌ టీమ్‌ జెర్సీ...
30-05-2022
May 30, 2022, 04:39 IST
మార్చి 28, 2022... ఐపీఎల్‌లో గుజరాత్‌ టైటాన్స్‌ మొదటి మ్యాచ్‌... షమీ వేసిన తొలి బంతికే లక్నో సూపర్‌ జెయింట్స్‌...
29-05-2022
May 29, 2022, 23:46 IST
ఐపీఎల్‌ 15వ సీజన్‌ చాంపియన్స్‌గా గుజరాత్‌ టైటాన్స్‌ ►ఐపీఎల్‌ 2022 సీజన్‌ చాంపియన్స్‌గా గుజరాత్‌ టైటాన్స్‌ నిలిచింది. 131 పరుగుల లక్ష్యంతో...
29-05-2022
May 29, 2022, 23:38 IST
రాజస్తాన్‌ రాయల్స్‌ స్టార్‌ స్పిన్నర్‌ యజ్వేంద్ర చహల్‌ ఐపీఎల్‌లో కొత్త చరిత్ర సృష్టించాడు. ఒక ఐపీఎ్‌ సీజన్‌లో స్పిన్నర్‌గా అత్యధిక వికెట్లు...
29-05-2022
May 29, 2022, 23:10 IST
రాజస్తాన్‌ రాయల్స్‌ ఆటగాడు రియాన్‌ పరాగ్‌ ఐపీఎల్‌లో అరుదైన ఫీట్‌ సాధించాడు.  ఈ సీజన్‌లో బ్యాటింగ్‌లో పెద్దగా మెరవనప్పటికి పరాగ్‌...
29-05-2022
May 29, 2022, 22:20 IST
ఐపీఎల్‌ 2022 సీజన్‌లో రాజస్తాన్‌ ఓపెనర్‌ జాస్‌ బట్లర్‌ సూపర్‌ ఫామ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. రాజస్తాన్‌ రాయల్స్‌ ఫైనల్‌...
29-05-2022
May 29, 2022, 21:11 IST
గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ సందర్భంగా ప్రపంచంలోనే అతిపెద్ద జెర్సీని ఐపీఎల్‌ నిర్వహకులు రూపొందించారు. తద్వారా...
29-05-2022
May 29, 2022, 20:48 IST
ఐపీఎల్‌ 2022 సీజన్‌ ఫైనల్‌ మ్యాచ్‌ గుజరాత్‌ టైటాన్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ మధ్య ఫైనల్‌ పోరుకు తెర లేచింది. టాస్‌...
29-05-2022
May 29, 2022, 19:51 IST
ఐపీఎల్‌-2022లో రాయల్‌ ఛాలంజెర్స్‌ బెంగళూరు ప్లే ఆఫ్స్‌లో ఇంటిముఖం పట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది సీజన్‌లో ఫాఫ్‌...
29-05-2022
May 29, 2022, 18:46 IST
రెండు నెలల పాటు క్రికెట్‌ అభిమానులను అలరించిన ఐపీఎల్‌ 2022 సీజన్‌కు నేటితో తెరపడనుంది. రాజస్తాన్‌ రాయల్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌...
29-05-2022
May 29, 2022, 17:16 IST
రాజస్తాన్‌ రాయల్స్ ఆల్‌రౌండర్‌ రియాన్‌ పరాగ్‌పై ఆ జట్టు బౌలింగ్‌ కోచ్‌, శ్రీలంక లెజెండ్‌ లసిత్‌ మలింగ ప్రశంసల వర్షం...
29-05-2022
May 29, 2022, 16:37 IST
ఐపీఎల్‌-2022 ఫైనల్‌ పోరులో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ అమీతుమీ తెల్చుకోవడానికి సిద్దమయ్యాయి. మే 29న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ...
29-05-2022
May 29, 2022, 15:35 IST
టీమిండియా యవ బౌలర్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ స్పిన్నర్‌ రవి బిష్ణోయ్‌పై గుజరాత్‌ టైటాన్స్‌ స్టార్ స్పిన్నర్‌  రషీద్ ఖాన్...
29-05-2022
May 29, 2022, 14:50 IST
ఐపీఎల్‌-2022 తుది సమరానికి రంగం సిద్దమైంది. ఫైనల్‌ పోరులో అహ్మదాబాద్‌ వేదికగా ఆదివారం గుజరాత్‌ టైటాన్స్‌, రాజస్తాన్‌ రాయల్స్‌ తలపడనున్నాయి....
29-05-2022
May 29, 2022, 14:48 IST
కోహ్లి రికార్డు బద్దలు కొట్టేందుకు సిద్ధమవుతున్న జోస్‌ బట్లర్‌!
29-05-2022
May 29, 2022, 12:58 IST
IPL 2022 Final GT Vs RR: ఐపీఎల్‌-2022 మెగా ఫైనల్‌ నేపథ్యంలో గుజరాత్‌ టైటాన్స్‌కు టీమిండియా మాజీ క్రికెటర్‌...
29-05-2022
May 29, 2022, 11:12 IST
IPL 2022 Final GT Vs RR- Winner Prediction: ఆస్ట్రేలియా క్రికెట​ దిగ్గజం, దివంగత షేన్‌ వార్న్‌ కోసమైనా...
29-05-2022
May 29, 2022, 09:09 IST
ఫైనల్లోనూ టాస్‌ కీలకం.. గెలిచిన జట్టు బ్యాటింగా? ఫీల్డింగా? 

Read also in:
Back to Top