IPL 2022 Final Highlights: ఐపీఎల్‌ చరిత్రలో యజ్వేంద్ర చహల్‌ సరికొత్త రికార్డు

IPL 2022: Yuzvendra Chahal 1st Bowler Most Wickets By Spinner IPL season - Sakshi

రాజస్తాన్‌ రాయల్స్‌ స్టార్‌ స్పిన్నర్‌ యజ్వేంద్ర చహల్‌ ఐపీఎల్‌లో కొత్త చరిత్ర సృష్టించాడు. ఒక ఐపీఎ్‌ సీజన్‌లో స్పిన్నర్‌గా అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చహల్‌ అరుదైన ఫీట్‌ సాధించాడు. గుజరాత్‌ టైటాన్స్‌తో ఫైనల్‌ పోరులో హార్దిక్‌ పాండ్యాను ఔట్‌ చేయడం ద్వారా ఈ సీజన్‌లో చహల్‌ 27వ వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో సూపర్‌ ఫామ్‌తో దూసుకెళ్తున్న చహల్‌ ఓవరాల్‌గా 17 మ్యాచ్‌ల్లో 7.75 ఎకానమీ రేటుతో 27 వికెట్లు పడగొట్టి పర్పుల్‌ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు.

తద్వారా ఇమ్రాన్‌ తాహిర్‌(26 వికెట్లు) రికార్డును బ్రేక్‌ చేసిన చహల్‌ తొలి స్థానానికి దూసుకెళ్లాడు. ఇంతకముందు 2019లో ఇమ్రాన్‌ తాహిర్‌ సీఎస్కే తరపున 26 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌ 2022 సీజన్‌లో ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహిస్తున్న లంక స్పిన్నర్‌ వనిందు హసరంగా కూడా 26 వికెట్లతో తాహిర్‌తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నాడు. సునీల్‌ నరైన్‌ 2012లో కేకేఆర్‌ తరపున స్పిన్నర్‌గా 24 వికెట్లు పడగొట్టి మూడో స్థానంలో ఉండగా.. 2013లో ముంబై ఇండియన్స్‌ తరపున హర్భజన్‌ 24 వికెట్లతో నాలుగో స్థానంలో ఉన్నాడు. 

చదవండి: IPL 2022: ఓవర్‌ యాక్షన్‌ అనిపించే రియాన్‌ పరాగ్‌ ఖాతాలో అరుదైన రికార్డు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top