IPL 2022 Final Highlights: ఓవర్‌ యాక్షన్‌ అనిపించే రియాన్‌ పరాగ్‌ ఖాతాలో అరుదైన రికార్డు

IPL 2022: Riyan Parag Was 2nd Player Most Catches By Fielder IPL Season - Sakshi

రాజస్తాన్‌ రాయల్స్‌ ఆటగాడు రియాన్‌ పరాగ్‌ ఐపీఎల్‌లో అరుదైన ఫీట్‌ సాధించాడు.  ఈ సీజన్‌లో బ్యాటింగ్‌లో పెద్దగా మెరవనప్పటికి పరాగ్‌ ఒక కొత్త రికార్డు సాధించాడు. ఒక సీజన్‌లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న రెండో ఆటగాడిగా రియాన్‌ పరాగ్‌ నిలిచాడు. గుజరాత్‌ టైటాన్స్‌తో ఫైనల్లో  మాథ్యూ వేడ్‌ రియాన్‌ పరాగ్‌ అందుకున్న క్యాచ్‌ 17వది. తద్వారా ఒక ఐపీఎల్‌ సీజన్‌లో అత్యధిక క్యాచ్‌లు తీసుకున్న జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు.

తొలి స్థానంలో ఏబీ డివిలియర్స్‌(2016లో 19 క్యాచ్‌లు), కీరన్‌ పొలార్డ్‌(15 క్యాచ్‌లు, 2015 సీజన్‌) మూడో స్థానంలో, డ్వేన్‌ బ్రావో(2013 సీజన్‌), డేవిడ్‌ మిల్లర్‌లు(2014 సీజన్‌) 14 క్యాచ్‌లతో సంయుక్తంగా నాలుగో స్థానంలో ఉన్నారు. కాగా పరాగ్‌  ఫైనల్‌ మ్యాచ్‌ పూర్తయ్యేలోపు మరో రెండు క్యాచ్‌లు అందుకుంటే డివిలయర్స్‌తో సమానంగా.. మూడు క్యాచ్‌లు అందుకుంటే అత్యధిక క్యాచ్‌లు తీసుకున్న తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించనున్నాడు. ఇక సీజన్‌లో రియాన్‌ పరాగ్‌ బ్యాటింగ్‌లో పెద్దగా రాణించింది లేదు. ఓవర్‌ యాక్షన్‌కు మారుపేరుగా నిలిచిన పరాగ్‌ 17 మ్యాచ్‌ల్లో 183 పరుగులు మాత్రమే చేశాడు. అతని ఖాతాలో ఒకే ఒక్క అర్థసెంచరీ ఉంది.

చదవండి: Jos Buttelr: కోహ్లి రికార్డు బద్దలు కాలేదు.. రాజస్తాన్‌ ఓపెనర్‌ది చరిత్రే

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top