ఒక్కో రన్ కు ఒక్కో కోటి రూపాయలు | Cameron Green to bowl in KKR vs LSG match, gets fitness clearance from Cricket Australia | Sakshi
Sakshi News home page

IPL 2026: ఒక్కో రన్ కు ఒక్కో కోటి రూపాయలు

Apr 8 2026 6:06 PM | Updated on Apr 8 2026 6:39 PM

Cameron Green to bowl in KKR vs LSG match, gets fitness clearance from Cricket Australia

ఐపీఎల్‌-2026 సీజ‌న్‌లో కోల్‌కతా నైట్‌రైడ‌ర్స్ త‌మ నాలుగో మ్యాచ్ ఆడేందుకు సిద్ద‌మైంది. కేకేఆర్ ఈ ధన‌ధాన్ లీగ్‌లో భాగంగా  గురువారం ఈడెన్ గార్డెన్స్ వేదిక‌గా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో త‌ల‌ప‌డ‌నుంది. తొలి రెండు మ్యాచ్‌ల‌లో ఓట‌మిపాలైన కేకేఆర్.. లక్నోపై ఎలాగైనా గెలిచి బోణీ కొట్టాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉంది.

అయితే ఈ మ్యాచ్‌కు కేకేఆర్‌కు గుడ్ న్యూస్ అందింది. స్టార్ ఆల్‌రౌండ‌ర్ కామెరాన్ గ్రీన్‌ బౌలింగ్ చేసేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా క్లియ‌రెన్స్ ఇచ్చింది. ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో అత‌డు బౌలింగ్ చేసే అవ‌కాశ‌ముంది. గ‌తేడాది జ‌రిగిన మినీ వేలంలో గ్రీన్‌ను రూ.25.2 కోట్ల భారీ ధరకు కేకేఆర్ కొనుగోలు చేసింది.

ఆల్‌రౌండ‌ర్‌గా ఉప‌యోప‌డ‌తాడ‌ని గ్రీన్‌పై అంత భారీ మొత్తాన్ని కేకేఆర్ ఫ్రాంచైజీ వెచ్చింది. కానీ గ్రీన్ మాత్రం ఇప్ప‌టివ‌ర‌కు కేకేఆర్ ఆడిన మూడు మ్యాచ్‌ల‌లోనూ  కేవ‌లం స్పెష‌లిస్టు బ్యాట‌ర్‌గా మాత్ర‌మే బ‌రిలోకి దిగాడు. దీంతో చాలా మంది మాజీలు విమ‌ర్శ‌లు వ‌ర్షం కురిపించారు. ఈ మాత్రం దానికి అంత ధ‌ర ఎందుకు అని కేకేఆర్‌పై కూడా ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు.

అయితే అత‌డు వెన్ను గాయం నుంచి కోలుకుని గతేడాది ఆఖ‌రిలో పోటీ క్రికెట్‌లోకి పున‌రాగ‌మ‌నం చేశాడు. ఆస్ట్రేలియా త‌ర‌పున కూడా అత‌డు చాలా మ్యాచ్‌ల‌లో కేవ‌లం బ్యాట‌ర్‌గా మాత్ర‌మే ఆడాడు. ఈ క్ర‌మంలో అత‌డి ఫిట్‌నెస్‌, వర్క్‌లోడ్ మేనెజ్‌మెంట్‌లో భాగంగా గ్రీన్‌కు ఐపీఎల్‌లో బౌలింగ్ చేసేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా అనుమ‌తి ఇవ్వ‌లేదు. కానీ అత‌డు ఇప్పుడు పూర్తి ఫిట్‌నెస్ సాధించి నెట్స్‌లో బౌలింగ్ చేస్తున్నాడు. దీంతో అత‌డికి సీఎ వైద్య బృందం క్లియరెన్స్ ఇచ్చినట్లు సమాచారం.

బ్యాటింగ్‌లో కూడా అట్టర్ ప్లాప్‌!
బౌలింగ్ విష‌యాన్ని పక్క‌న పెడితే బ్యాటింగ్‌లో కూడా అట్ట‌ర్ ప్లాప్ అవుతున్నాడు. టాపార్డ‌ర్‌లో బ్యాటింగ్ వ‌స్తున్న గ్రీన్ క‌నీస ప్ర‌భావం చూప‌లేక‌పోతున్నాడు. మూడు మ్యాచ్‌లలో 24 పరుగులు మాత్రమే చేశాడు. ప్ర‌స్తుతానికి అత‌డి ప్ర‌ద‌ర్శ‌న చూస్తుంటే ఒక్కో రన్ కు ఒక్కో కోటి రూపాయలు తీసుకున్న‌ట్లు ఉంది. క‌నీసం త‌ర్వాత మ్యాచ్‌ల‌లోనైనా గ్రీన్ త‌న ధ‌ర‌కు త‌గ్గ న్యాయం చేస్తాడో లేదో చూడాలి.
చదవండి: IPL 2026: వైభ‌వ్‌, ఆయూశ్ కాదు.. టీమిండియాలోకి ఎవరూ ఊహించని ప్లేయర్‌!

Advertisement
 
Advertisement
Advertisement