Andre Fletcher: దూసుకొచ్చిన బంతి.. కుప్పకూలిన వెస్టిండీస్‌ బ్యాటర్‌.. అయితే.. | BPL: Andre Fletcher Taken To Hospital After Being Hit On Neck | Sakshi
Sakshi News home page

Andre Fletcher: దూసుకొచ్చిన బంతి.. కుప్పకూలిన వెస్టిండీస్‌ బ్యాటర్‌.. మరేం పర్లేదు..

Jan 25 2022 4:55 PM | Updated on Jan 25 2022 5:07 PM

BPL: Andre Fletcher Taken To Hospital After Being Hit On Neck - Sakshi

PC: BPL

BPL 2022: వెస్టిండీస్‌ బ్యాటర్‌ ఆండ్రీ ఫ్లెచర్‌ గాయపడ్డాడు. బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా ఖుల్నా టైగర్స్‌, చట్టోగ్రామ్‌ చాలెంజర్స్‌ మధ్య సోమవారం మ్యాచ్‌ జరిగింది. ఈ క్రమంలో ఖుల్నాకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఫ్లెచర్‌కు బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో గాయమైంది.  ప్రత్యర్థి జట్టు బౌలర్‌ రహమాన్‌ రజా సంధించిన బంతి మెడకు బలంగా తాకడంతో అతడు మైదానంలోనే కుప్పకూలిపోయాడు. దీంతో వెంటనే ఫ్లెచర్‌ను ఆస్పత్రికి తరలించారు. 

ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు ఖుల్నా టైగర్స్‌ మేనేజర్‌ తెలిపారు. ‘‘తనకు ఎటువంటి ప్రమాదం లేదు. ముందు జాగ్రత్త చర్యగానే ఆస్పత్రికి తీసుకువెళ్లాం. ప్రస్తుతం బాగానే ఉన్నాడు’’ అని పేర్కొన్నారు. ఇక ఈ మ్యాచ్‌లో టైగర్స్‌కు ఓటమే ఎదురైంది. 25 పరుగుల తేడాతో చిట్టోగ్రామ్‌ చాలెంజర్స్‌.. టైగర్స్‌పై విజయం సాధించింది. ఒక వికెట్‌ తీయడంతో పాటుగా.... 34 పరుగులతో అజేయంగా నిలిచిన బెన్నీ హావెల్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు గెలుచుకున్నాడు. 

స్కోర్లు:
చిటోగ్రామ్‌- 190/7 (20)
టైగర్స్‌- 165/9 (20) 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement