#MSDhoni: ఏందీ క్రేజ్‌.. బంతులు వేయాలంటే భయపడుతున్నారు!

Bowlers Not Delivers-Good Balls Because-MS Dhoni Craze From-Cricket-Fans - Sakshi

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో సీఎస్‌కే ప్లేఆఫ్‌కు చేరుకోవాలంటే ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌ కచ్చితంగా గెలవాల్సిందే. దీనిలో భాగంగా తొలి అంకం దిగ్విజయంగా పూర్తైంది. శనివారం ఢిల్లీతో మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో సీఎస్‌కే 223 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు రుతురాజ్‌, కాన్వేలు అర్థసెంచరీలతో రాణించగా.. మధ్యలో శివమ్‌ దూబే, ఆఖర్లో జడేజా విలువైన ఇన్నింగ్స్‌ ఆడారు. 

అయితే మ్యాచ్‌లో మాత్రం వీరందరిని దాటి ధోని మరోసారి హైలెట్‌ అయ్యాడు. తాను ఆడింది ఐదు బంతులు.. చేసింది నాలుగు పరుగులు.. అయినా స్టేడియం మొత్తం ధోని నామస్మరణతో మార్మోగిపోయింది. మ్యాచ్‌ ఢిల్లీలో జరుగుతున్నా సపోర్ట్‌ మాత్రం సీఎస్‌కేకే. ఎందుకంటే ఢిల్లీ ఎప్పుడో ప్లేఆఫ్‌ రేసు నుంచి ఎలిమినేట్‌ అయింది. అందుకే స్టాండ్స్‌ అన్ని సీఎస్‌కే జెర్సీలతో నిండిపోయాయి.

ఇవన్నీ ఒక ఎత్తయితే ధోనిపై ఉన్న అభిమానం మరొక ఎత్తు. సీజన్‌లో ధోని క్రేజ్‌ ఎలా ఉందంటే అతను ఒక్క బంతి ఆడినా చాలు మాకు అదే మహాభాగ్యం అన్నట్లుగా అభిమానులు పరవశించిపోతున్నారు. అయితే ధోని క్రేజ్‌కు ప్రత్యర్థి బౌలర్లు ఒత్తిడిలో సరైన బంతులు వేయడంలో విఫలమవుతున్నారు.

తాజాగా సీఎస్‌కే ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్‌ వేసిన చేతన్‌ సకారియా బౌలింగ్‌లో ఇది స్పష్టంగా కనిపించింది. ఓవర్‌ చివరి రెండు బంతులు వేయాల్సిన చోట ఒక నోబాల్‌, వైడ్‌బాల్‌ వేశాడు. కారణం ఎదురుగా క్రీజులో ఉంది ధోని. దీంతో అటు స్టేడియం మొత్తం ధోని.. ధోని అరుపులతో దద్దరిల్లడంతో ఒత్తిడికి లోనవుతున్న బౌలర్లు బంతులను సరిగా వేయడం లేదని అభిమానులు వాపోయారు.

చదవండి: '16.25 కోట్లు పట్టుకుపోతున్నాడు.. ఇంపాక్ట్‌గా కూడా పనికిరాలేదా?'

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top