క్రికెట్‌ చరిత్రలోనే అత్యంత చెత్త నో బాల్‌.. వీడియో వైరల్‌ | Bizarre No Ball In T10 League Leaves Social Media Stunned | Sakshi
Sakshi News home page

Abu Dhabi T10: క్రికెట్‌ చరిత్రలోనే అత్యంత చెత్త నో బాల్‌.. వీడియో వైరల్‌

Published Sun, Dec 3 2023 12:22 PM | Last Updated on Sun, Dec 3 2023 12:48 PM

Bizarre No Ball In T10 League Leaves Social Media Stunned - Sakshi

అబుదాబి టీ10 లీగ్‌లో భాగంగా శనివారం  చెన్నై బ్రేవ్స్‌- నార్తర్న్ వారియర్స్  జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో నార్తర్న్‌ వారియర్స్‌ బౌలర్‌  అభిమన్యు మిథున్ విచిత్రమైన నో బాల్‌ను సంధించాడు. చెన్నై బ్రేవ్స్‌ ఇన్నింగ్స్‌ 5 ఓవర్‌లో మిథన్‌ వేసిన నో బాల్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. 5 ఓవర్‌లో మూడో బంతిని వేసే క్రమంలో మిథున్‌ ఓవర్‌ స్టేప్‌ చేశాడు.

దీంతో ఫీల్డ్‌ అంపైర్‌ నో బాల్‌గా ప్రకటించాడు. అయితే రిప్లేలో అతడు ఫుట్‌కు క్రీజుకు మధ్య దూరం అందరినీ ఆశ్చర్యపరిచింది. అతడు క్రీజు నుంచి చాలం దూరంలో తన ఫుట్‌ను ల్యాండ్‌ చేశాడు. ఇది చూసిన నెటిజన్లు.. క్రికెట్‌ చరిత్రలో అత్యంత చెత్త నోబాల్‌ అని కామెంట్లు చేస్తున్నారు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన నార్తర్న్‌ వారియర్స్‌ నిర్ణీత 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. వారియర్స్‌ బ్యాటర్లలో హజ్రతుల్లా జజాయ్‌(54) పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.  అనంతరం 107 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై బ్రేవ్స్‌ 9.7 ఓవర్‌లో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement