టీమిండియాతో టెస్ట్‌ సిరీస్‌.. ఇంగ్లండ్‌ టీమ్‌కు బ్యాడ్‌ న్యూస్‌

Ben Stokes Is Unlikely To Bowl In The Test Series Against India - Sakshi

వచ్చే ఏడాది భారత్‌తో జరిగే టెస్ట్‌ సిరీస్‌కు సంబంధించి ఇంగ్లండ్‌ జట్టుకు ఓ చేదు వార్త తెలిసింది. ఆ జట్టు సారధి, స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ భారత్‌తో సిరీస్‌లో బౌలింగ్‌ చేయడని ఇంగ్లండ్‌ డైరక్టర్‌ ఆఫ్‌ క్రికెట్‌ రాబ్‌ కీ స్పష్టం చేశాడు. భారత్‌తో సిరీస్‌కు ఇంగ్లండ్‌ జట్టును ప్రకటిస్తున్న సందర్భంగా కీ ఈ విషయమై క్లారిటీ ఇచ్చాడు. భారత్‌తో సిరీస్‌లో స్టోక్స్‌ చేత బౌలింగ్‌ చేయించడం మొదటి నుంచి తమ ప్రణాళికల్లో లేదని కీ వివరణ ఇచ్చాడు.

స్టోక్స్‌ ఇటీవలే మోకాలికి శస్త్రచికిత్స చేయించుకున్నాడని.. ప్రస్తుతం అతను రీహ్యాబ్‌లో ఉన్నాడని.. భారత్‌తో సిరీస్‌ సమయానికంతా అతను పూర్తిగా కోలుకుంటాడని కీ తెలిపాడు. భారత్‌లో స్టోక్స్‌ బౌలింగ్‌ చేయడన్న విషయం తెలిసి ఇంగ్లండ్‌ అభిమానులు నిరాశ చెందుతున్నారు. స్టోక్స్‌ బంతితో రాణిస్తే తమ విజయావకాశాలు మరింత మెరుగుపడేవని వారు అభిప్రాయపడుతున్నారు. 

కాగా, 2024 జనవరి 25 నుంచి మార్చి 11 వరకు భారత్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ కోసం 16 మంది సభ్యుల జట్టును ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) నిన్న (డిసెంబర్‌ 11) ప్రకటించింది. ఈ జట్టుకు సారధిగా బెన్‌ స్టోక్స్‌ను ఎంపిక చేసిన ఈసీబీ.. ముగ్గురు అన్‌క్యాప్డ్‌ ప్లేయర్లకు (గస్‌ అట్కిన్సన్‌ (పేస్‌ బౌలర్‌), టామ్‌ హార్ట్లీ (ఆఫ్‌ స్పిన్నర్‌), షోయబ్‌ బషీర్‌ (ఆఫ్‌ స్పిన్నర్‌)) అవకాశం కల్పించింది. ఈ సిరీస్‌ కోసం భారత జట్టును ప్రకటించాల్సి ఉంది. 

భారత్‌తో సిరీస్‌కు ఇంగ్లండ్‌ జట్టు: బెన్ స్టోక్స్ (కెప్టెన్‌), రెహాన్ అహ్మద్, జేమ్స్ ఆండర్సన్, గస్ అట్కిన్సన్, జానీ బెయిర్‌స్టో, షోయబ్ బషీర్, హ్యారీ బ్రూక్, జాక్ క్రాలే, బెన్ డకెట్, బెన్ ఫోక్స్, టామ్ హార్ట్లీ, జాక్ లీచ్, ఒల్లీ పోప్, ఓలీ రాబిన్సన్, జో రూట్, మార్క్ వుడ్

షెడ్యూల్‌..

  • తొలి టెస్ట్‌: జనవరి 25-29 (హైదరాబాద్‌)
  • రెండో టెస్ట్‌: ఫిబ్రవరి 2-6 (వైజాగ్‌)
  • మూడో టెస్ట్‌: ఫిబ్రవరి 15-19 (రాజ్‌కోట్‌)
  • నాలుగో టెస్ట్‌: ఫిబ్రవరి 23-27 (రాంచీ)
  • ఐదో టెస్ట్‌: మార్చి 7-11 (ధర్మశాల)

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top