AUS vs PAK: పాకిస్తాన్‌కు చుక్కలు చూపించిన ఆస్ట్రేలియా..

Ben McDermotts Ton Powers Australia To 348 8 Against Pakistan - Sakshi

పాకిస్తాన్‌తో రెండో వన్డేలో ఆస్ట్రేలియా చెలరేగి ఆడింది.  ఆసీస్‌ బ్యాటర్లు చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 348 పరుగుల భారీ స్కోర్‌ సాధించింది. ఆసీస్‌ బ్యాటర్‌ బెన్ మెక్‌డెర్మోట్ అద్భుతమైన సెంచరీతో మెరిశాడు. మెక్‌డెర్మోట్ 108 బంతుల్లో 104 పరుగులు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 4 సిక్స్‌లు ఉన్నాయి. కాగా వన్డేల్లో అతడికి ఇది తొలి సెంచరీ కావడం విశేషం. ఇక అతడితో పాటు ట్రావిస్ హెడ్ మరోసారి బ్యాట్‌ ఝుళిపించాడు. 70 బంతుల్లో 89 పరుగులు సాధించి అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు.

కాగా టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా ఆదిలోనే కెప్టెన్‌ పింఛ్‌ వికెట్‌ కోల్పోయింది. షాహిన్‌ షా ఆఫ్రిది బౌలింగ్‌లో ఫిం‍చ్‌ ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. అనంతరం మెక్‌డెర్మోట్, హెడ్‌ ఆస్ట్రేలియాను అదుకున్నారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 162 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆస్ట్రేలియా బ్యాటర్లలో మెక్‌డెర్మోట్(108),హెడ్‌(89), లబుషేన్‌(59), స్టోయినిష్‌(49) పరుగులతో రాణించారు. ఇక పాకిస్తాన్‌ బౌలర్లలో షాహిన్‌ షా ఆఫ్రిది నాలుగు వికెట్ల పడగొట్టగా, మహ్మద్‌ వసీం రెండు, జహీద్‌ మహ్మద్‌, కుషీదల్‌ షా చెరో వికెట్‌ సాధించారు.

చదవండి: Ruturaj Gaikwad: ఎల్బీ నుంచి తప్పించుకున్నా.. రనౌట్‌కు బలయ్యాడు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top