
స్వదేశంలో న్యూజిలాండ్-'ఎ' తో జరగనున్న సిరీస్(నాలుగు రోజులు పాటు జరిగే టెస్టు మ్యాచ్)కు భారత్- 'ఎ' జట్టును బీసీసీఐ ఆదివారం ప్రకటించింది. ఈ జట్టుకు టీమిండియా యువ ఆటగాడు శుబ్‌మన్ గిల్ సారథ్యం వహించనున్నాడు. కాగా బీసీసీఐ ప్రకటించిన ఈ జట్టులో హనుమ విహారి, వాషింగ్టన్ సుందర్, కేఎస్ భరత్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్ వంటి అంతర్జాతీయ ఆటగాళ్లు ఉన్నారు.
అదే విధంగా రంజీట్రోఫీ(2021-22)లో అదరగొట్టిన యశస్వి జైస్వాల్, షామ్స్ మూలానీ, సర్ఫరాజ్ ఖాన్, యష్ దూబే వంటి యువ ఆటగాళ్లకు కూడా అవకాశం లభించింది. కాగా ఈ పర్యటనలో భాగంగా న్యూజిలాండ్‌తో భారత్ మూడు టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది.
సెప్టెంబర్ 1న బెంగళూరు వేదికగా జరగనున్న తొలి టెస్టుతో న్యూజిలాండ్-‘ఎ’ టూర్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లోని మ్యాచ్‌లు అన్నీ బెంగళూరు వేదికగానే జరగనున్నాయి. అదే విధంగా వన్డే సిరీస్‌కు చెన్నై వేదికగా కానుంది.
భారత్-ఏ జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), యశ్ దూబే, హనుమ విహారి, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, కెఎస్ భరత్ (వికెట్ కీపర్), షమ్స్ ములానీ, జలజ్ సక్సేనా, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, యశస్వి జైస్వాల్, శుభమ్ శర్మ, అక్షయ్ వాడ్కర్, షాబాజ్ అహ్మద్, మణిశంకర్ మురాసింగ్
చదవండి: David Warner: వార్నర్ అభిమానులకు గుడ్ న్యూస్.. తొమ్మిదేళ్ల తర్వాత ఆ లీగ్‌లో రీ ఎంట్రీ!