మిచెల్‌ మార్ష్ వీరవిహారం

Bangladesh lost against Australia by 8 wickets - Sakshi

132 బంతుల్లో 17 ఫోర్లు, 9 సిక్సర్లతో 177 నాటౌట్‌ 

విజయంతో ముగించిన ఆ్రస్టేలియా 

8 వికెట్లతో బంగ్లాదేశ్‌ చిత్తు  

పుణే: ఐదు సార్లు విజేత ఆ్రస్టేలియా ప్రపంచకప్‌లో లీగ్‌ దశను ఘనంగా ముగించింది. ఆరంభంలో తడబడి రెండు మ్యాచ్‌లు ఓడినా...ఆ తర్వాత ప్రతీ మ్యాచ్‌కు తమ ఆటను మెరుగుపర్చుకుంటూ వచ్చింది.  సెమీఫైనల్‌ స్థానం ఖాయమైన తర్వాతా అదే దూకుడును కనబర్చి ఏడో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది.  శనివారం జరిగిన పోరులో ఆసీస్‌ 8 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసింది.

టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది. తౌహీద్‌ హ్రిదయ్‌ (79 బంతుల్లో 74; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), నజు్మల్‌ హొస్సేన్‌ (57 బంతుల్లో 45; 6 ఫోర్లు) రాణించగా...తన్‌జిద్‌ (36), లిటన్‌ దాస్‌ (36), మహ్ముదుల్లా (32), మెహదీ హసన్‌ మిరాజ్‌ (29) ఫర్వాలేదనిపించారు. ఆ తర్వాత ఆ్రస్టేలియా 44.4 ఓవర్లలో 2 వికెట్లకు 307 పరుగులు చేసి విజయాన్నందుకుంది.

‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’  మిచెల్‌ మార్ష్ (132 బంతుల్లో 177 నాటౌట్‌; 17 ఫోర్లు, 9 సిక్సర్లు) విధ్వంసకర బ్యాటింగ్‌ ప్రదర్శన కనబర్చగా, స్టీవ్‌ స్మిత్‌ (64 బంతుల్లో 63 నాటౌట్‌; 4 ఫోర్లు, 1 సిక్స్‌) అతనికి అండగా నిలిచాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 22.3 ఓవర్లలోనే అభేద్యంగా 175 పరుగులు జోడించారు. డేవిడ్‌ వార్నర్‌ (61 బంతుల్లో 53; 6 ఫోర్లు) కూడా అర్ధసెంచరీ చేశాడు. 

స్కోరు వివరాలు 
బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌: తన్‌జిద్‌ (సి) అండ్‌ (బి) అబాట్‌ 36; లిటన్‌ (సి) లబుషేన్‌ (బి) జంపా 36; నజు్మల్‌ రనౌట్‌ 45; తౌహిద్‌ (సి) లబుõÙన్‌ (బి) స్టొయినిస్‌ 74; మహ్ముదుల్లా రనౌట్‌ 32; ముషి్ఫకర్‌ (సి) కమిన్స్‌ (బి) జంపా 21; మెహిదీ హసన్‌ మిరాజ్‌ (సి) కమిన్స్‌ (బి) అబాట్‌ 29; నజుమ్‌ రనౌట్‌ 7; మెహదీ హసన్‌ నాటౌట్‌ 2; తస్కిన్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 24; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 306. వికెట్ల పతనం: 1–76, 2–106, 3–170, 4–214, 5–251, 6–286, 7–303, 8–304. బౌలింగ్‌: హాజల్‌వుడ్‌ 7–1–21–0, కమిన్స్‌ 8–0–56–0, అబాట్‌ 10–0–61–2, మార్ష్ 4–0–48–0, జంపా 10–0–32–2, హెడ్‌ 6–0–33–0, స్టొయినిస్‌ 5–0–45–1. 

ఆ్రస్టేలియా ఇన్నింగ్స్‌: హెడ్‌ (బి) తస్కిన్‌ 10; వార్నర్‌ (సి) నజు్మల్‌ (బి) ముస్తఫిజుర్‌ 53; మార్ష్ నాటౌట్‌ 177; స్మిత్‌ నాటౌట్‌ 63; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (44.4 ఓవర్లలో 2 వికెట్లకు) 307. వికెట్ల పతనం: 1–12, 2–132. బౌలింగ్‌: తస్కిన్‌ అహ్మద్‌ 10–0–61–1, మెహిదీ హసన్‌ 9–0–38–0, నజుమ్‌ అహ్మద్‌ 10–0–85–0, మెహిదీహసన్‌ మిరాజ్‌ 6–0–47–0, ముస్తఫిజుర్‌ 9.4–1–76–1.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top