
కొలంబో వేదికగా శ్రీలంకతో జరిగిన రెండో వన్డేలో 16 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 1-1తో బంగ్లాదేశ్ సమం చేసింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 45.5 ఓవర్లలో 248 పరుగులకు ఆలౌటైంది.
పర్వేజ్ హుసేన్ (69 బంతుల్లో 67; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), తౌహీద్ హృదయ్ (69 బంతుల్లో 51; 2 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేయగా...తన్జీమ్ హసన్ (21 బంతుల్లో 33 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించాడు. లంక బౌలర్లలో అసిత ఫెర్నాండో 4, వనిందు హసరంగ 3 వికెట్లు పడగొట్టారు.
తిప్పేసిన తన్వీర్..
అనంతరం లక్ష్య చేధనలో శ్రీలంక 48.5 ఓవర్లలో 232 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా స్పిన్నర్ తన్వీర్ ఇస్లాం (5/39) ఐదు వికెట్లు పడగొట్టి లంకేయుల పతనాన్ని శాసించాడు. అతడితో పాటు తన్జీమ్ హసన్ రెండు.. షమీమ్, మెహది హసన్, ముస్తఫిజుర్ రెహ్మన్ తలా వికెట్ సాధించారు.
జనిత్ లియనాగే (85 బంతుల్లో 78; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), కుశాల్ మెండిస్ (31 బంతుల్లో 56; 9 ఫోర్లు, 1 సిక్స్), కమిందు మెండిస్ (51 బంతుల్లో 33; 2 ఫోర్లు) రాణించినా...జట్టును గెలిపించడంలో విఫలమయ్యారు. సిరీస్ ఫలితాన్ని తేల్చే చివరి వన్డే మంగళవారం పల్లెకెలెలో జరుగుతుంది.
చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన టీమిండియా.. టెస్టు క్రికెట్ హిస్టరీలోనే