
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా విజయం దిశగా పయనిస్తోంది. 608 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ టాపార్డర్ తడబడింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తమ రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది. భారత్ విజయానికి ఇంకా 7 వికెట్లు అవసరం కాగా.. ఇంగ్లండ్ గెలుపునకు 536 పరుగులు కావాలి.
ఇక ఈ ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో గిల్ సారథ్యంలోని భారత జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. భారత తమ టెస్టు క్రికెట్ హిస్టరీలో ఓ మ్యాచ్‌లో 1000కు పైగా పరుగులు చేయడం ఇదే తొలిసారి. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగులు చేసిన టీమిండియా.. రెండో ఇన్నింగ్స్‌లో 427 పరుగులు చేసింది.
మొత్తం రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 1014 పరుగులు నమోదు చేసింది. ఇప్పటివరకు 2004లో సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియాపై చేసిన 916 పరుగులకే భారత్‌కు అత్యధికం. తాజా మ్యాచ్‌తో చరిత్రను యంగ్ టీమిండియా తిరగ రాసింది.
అదరగొట్టిన గిల్..
ఇక ఈ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌లోనూ భారత కెప్టెన్ శుబ్‌మన్ గిల్ అదరగొట్టాడు. మొదటి ఇన్నింగ్స్‌లో ద్విశతకంతో చెలరేగిన శుబ్‌మన్.. రెండో ఇన్నింగ్స్‌లో (162 బంతుల్లో 161; 13 ఫోర్లు, 8 సిక్స్‌లు) శతకంతో కదం తొక్కాడు. దీంతో భారత్ తమ సెకెండ్ ఇన్నింగ్స్ 83 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 427 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.
భారత బ్యాటర్లలో గిల్‌తో పాటు రవీంద్ర జడేజా (118 బంతుల్లో 69 నాటౌట్; 5 ఫోర్లు, 1 సిక్స్), రిషభ్ పంత్ (58 బంతుల్లో 65; 8 ఫోర్లు, 3 సిక్స్‌లు), కేఎల్ రాహుల్ (84 బంతుల్లో 55; 10 ఫోర్లు) అర్ధ శతకాలతో రాణించారు. తొలి ఇన్నింగ్స్‌లో లభించిన ఆధిక్యాన్ని జోడించి ఇంగ్లండ్ ముందు 608 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ఉంచింది.
చదవండి: IND vs ENG: చరిత్ర సృష్టించిన టీమిండియా.. టెస్టు క్రికెట్ హిస్టరీలోనే