UEFA Euro 2020: ఆస్ట్రియా తొలిసారి...

Austria advance to last 16 with win over Ukraine in final group game - Sakshi

బుకారెస్ట్‌: యూరో కప్‌ ఫుట్‌బాల్‌ టోర్నమెంట్‌లో ఆస్ట్రియా జట్టు తొలిసారి నాకౌట్‌ దశకు అర్హత సాధించింది. ఉక్రెయిన్‌తో సోమవారం జరిగిన గ్రూప్‌ ‘సి’ చివరి రౌండ్‌ లీగ్‌ మ్యాచ్‌లో ఆస్ట్రియా 1–0తో గెలిచింది. 21వ నిమిషంలో బౌమ్‌గార్ట్‌నర్‌ ఆస్ట్రియాకు ఏకైక గోల్‌ అందించాడు.

రెండో విజయంతో గ్రూప్‌ ‘సి’లో ఆస్ట్రియా ఆరు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి ప్రిక్వార్టర్‌ ఫైనల్‌కు చేరింది. 2008, 2016 యూరో టోర్నీలలో ఆస్ట్రియా లీగ్‌ దశలోనే ఇంటిముఖం పట్టింది. మరోవైపు అమ్‌స్టర్‌డామ్‌లో జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ 3–0తో నార్త్‌ మెసడోనియాను ఓడించి తొమ్మిది పాయింట్లతో గ్రూప్‌ ‘సి’ టాపర్‌గా నిలిచింది. నెదర్లాండ్స్‌ తరఫున డెపే (24వ ని.లో) ఒక గోల్‌ చేయగా... వినాల్డమ్‌ (51వ, 58వ ని.లో) రెండు గోల్స్‌ సాధించాడు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top