మెగ్‌ లానింగ్‌ గుడ్‌బై 

Australia captain Lanning quits international womens cricket - Sakshi

అంతర్జాతీయ మహిళల క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఆస్ట్రేలియా స్టార్‌ 

ఏడు ప్రపంచకప్‌ టైటిల్స్‌లో భాగస్వామి  

మెల్‌బోర్న్‌: మహిళల క్రికెట్‌కే మకుటం లేని మహారాణి మెగ్‌ లానింగ్‌. ఆటతో, సారథ్య నైపుణ్యంతో ఆ్రస్టేలియా జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన ఈ విజయవంతమైన సారథి, 13 ఏళ్ల ఫలప్రదమైన అంతర్జాతీయ కెరీర్‌కు వీడ్కోలు పలికింది. ఆ్రస్టేలియా అమ్మాయిల క్రికెట్లో ఎవర్‌గ్రీన్‌ ‘మెగాస్టార్‌’గా కెపె్టన్‌ లానింగ్‌కు పెట్టింది పేరు.

31 ఏళ్ల వన్నె తగ్గని ఈ క్రికెటర్‌ తన ప్రతిభా పాటవాలతో ఏకంగా ఏడు ప్రపంచకప్‌లలో భాగమైంది. ఇందులో ఐదు టైటిల్స్‌ ఆమె కెప్టెన్సీలోనే వచ్చాయి. గతేడాది లానింగ్‌ సారథ్యంలో ఆసీస్‌ మహిళల జట్టు కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణ పతకాన్ని గెలిచింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికా ఆతిథ్యమిచ్చిన టి20 ప్రపంచకప్‌లో జట్టును విజేతగా నిలిపాక మళ్లీ ఆమె బరిలోకి దిగలేదు. ఆరోగ్య సమస్యలతో ఇంగ్లండ్, వెస్టిండీస్‌ పర్యటలనకు దూరంగా ఉంది. 

ఇలా అరంగేట్రం: జన్మతః సింగపూర్‌ అమ్మాయి అయిన మెగ్‌... న్యూజిలాండ్‌తో 2010లో జరిగిన టి20తో అంతర్జాతీయ అరంగేట్రం చేసింది. కెరీర్‌ లో ఆఖరి మ్యాచ్‌ కూడా ఈ ఫార్మాట్‌లోనే ఆడింది. 

అలా సంచలనం: పిన్న వయసు (21 ఏళ్లు)లోనే కెప్టెన్‌ అయిన ‘ఆసీస్‌ యంగెస్ట్‌ క్రికెటర్‌’. ఒకే ఒక్క  వన్డే సిరీస్‌లో అత్యధిక పరుగులు (1232) చేసిన కెపె్టన్‌గా ఘనత. టి20ల్లో అత్యధికంగా వంద మ్యాచ్‌ల్లో సారథ్యం వహించిన తొలి కెపె్టన్‌గానూ రికార్డు. మెగ్‌ లానింగ్‌ మొత్తం 179 మ్యాచ్‌ల్లో కెపె్టన్‌గా వ్యవహరించగా, ఆమె కెప్టెన్సీలో ఆసీస్‌ జట్టు 146 మ్యాచ్‌ల్లో గెలిచింది.  

‘కప్‌’ల కహాని: రెండు వన్డే వరల్డ్‌కప్‌లు (2013, 2022), ఐదు టి20 ప్రపంచకప్‌ (2012, 2014, 2018, 2020, 2023)లలో విజయవంతమైన కెపె్టన్‌గా, బ్యాటర్‌గా నిరూపించుకుంది. లానింగ్‌ సారథ్యంలో ఆసీస్‌ 2022 వన్డే వరల్డ్‌కప్‌లో, 2014, 2018, 2020, 2023 టి20 వరల్డ్‌కప్‌లో విజేతగా నిలిచింది.  

బ్యాటింగ్‌లో సునామీ: న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేలో కేవలం 45 బంతుల్లోనే వేగవంతమైన సెంచరీ సాధించిన ఆసీస్‌ క్రికెటర్‌గా రికార్డు.  

కెరీర్‌ ప్రొఫైల్‌: ఆరు టెస్టులు ఆడి 345 పరుగులు, 103 వన్డేల్లో 4602 పరుగులు సాధించింది. ఇందు లో 15 సెంచరీలు, 21 ఫిఫ్టీలున్నాయి. 132 టి20ల్లో 3405 పరుగులు చేసింది. 2 శతకాలు, 15 అర్ధసెంచరీలున్నాయి. ఓవరాల్‌గా 241 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో కలిపి లానింగ్‌ 8,352 పరుగులు చేసింది.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top