Ashes 2023: England Drops James Anderson Tongue For Third Test - Sakshi
Sakshi News home page

Ashes 2023: అండర్సన్‌పై వేటు.. బ్రూక్‌కు ప్రమోషన్‌; మూడో టెస్టుకు ఇంగ్లండ్‌ జట్టు ఇదే

Published Wed, Jul 5 2023 6:13 PM

Ashes 2023: England Drops James-Anderson-Tongue For Third-Test - Sakshi

ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌లో తొలి రెండు టెస్టుల్లో పరాజయాలు చవిచూసిన ఇంగ్లండ్‌ కాస్త డీలా పడినట్లు కనిపిస్తోంది. ఎలాగైనా మూడో టెస్టులో గెలవాలన్న పట్టుదలతో ఉంది. లీడ్స్‌ వేదికగా మూడో టెస్టు మొదలుకానున్న నేపథ్యంలో ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు(ఈసీబీ) బుధవారం తుది జట్టును ప్రకటించింది. అంతా ఊహించినట్లుగానే తొలి రెండు టెస్టుల్లో వికెట్లు తీయడంలో విఫలమైన సీనియర్‌ బౌలర్‌ జేమ్స్‌ అండర్సన్‌పై వేటు పడింది.

41 ఏళ్ల  అండర్సన్‌ టెస్టుల్లో ఇంగ్లండ్‌ తరపున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా నిలిచాడు. ఇప్పటివరకు 179 టెస్టుల్లో 688 వికెట్లు పడగొట్టాడు. ఆసీస్‌తో మూడో టెస్టుకు అతన్ని పక్కనబెట్టారు. అండర్సన్‌తో పాటు రెండో టెస్టులో ఐదు వికెట్లతో రాణించిన జోష్‌ టంగ్‌ను కూడా పక్కనబెట్టడం ఆశ్చర్యం కలిగించింది. వీరిద్దరి స్థానాల్లో ఆల్‌రౌండర్‌ క్రిస్‌ వోక్స్‌తో పాటు మార్క్‌ వుడ్‌లు తుది జట్టులోకి వచ్చారు.

ఇక భుజం గాయంతో సిరీస్‌కు దూరమైన బ్యాటర్‌ ఓలీ పోప్‌ స్థానంలో ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీ జట్టులోకి వచ్చాడు. ఇక హ్యారీ బ్రూక్‌కు బ్యాటింగ్‌లో ప్రమోషన్‌ వచ్చింది. లార్డ్స్‌ టెస్టులో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన హ్యారీ బ్రూక్‌.. మూడో టెస్టులో మాత్రం ఓలీ పోప్‌ స్థానమయిన నెంబర్‌-3లో బ్యాటింగ్‌కు రానున్నాడు.  ఈ మ్యాచ్‌లో గనుక ఆస్ట్రేలియా విజయం సాధిస్తే మాత్రం ఇంగ్లండ్‌ గడ్డపై 22 ఏళ్ల తర్వాత యాషెస్‌ సిరీస్‌ను గెలిచిన కెప్టెన్‌గా పాట్‌ కమిన్స్‌ చరిత్ర సృష్టించనున్నాడు.

మూడో టెస్టుకు ఇంగ్లండ్ జట్టు: జాక్ క్రాలీ, బెన్ డకెట్, హ్యారీ బ్రూక్, జో రూట్, జానీ బెయిర్‌స్టో (వికెట్‌ కీపర్‌), బెన్ స్టోక్స్ (కెప్టెన్‌), మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, ఓలీ రాబిన్సన్, స్టువర్ట్ బ్రాడ్, మార్క్ వుడ్

చదవండి: దిగ్గజంతో చేతులు కలిపిన రోహిత్‌, విరాట్‌..

#Neymar: విలాసాల కోసం కృత్రిమ సరస్సు?.. రూ. 27 కోట్లు జరిమానా

Advertisement
Advertisement