
డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత టీమిండియా వెస్టిండీస్ టూర్‌కు సన్నద్ధమైంది. ఇప్పటికే కరీబియన్‌కు చేరుకున్న భారత ఆటగాళ్లు తమ ప్రాక్టీస్‌ను ఆరంభించారు. ఇక విండీస్ పర్యటనలో టీమిండియా రెండు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టి20 మ్యాచ్‌లు ఆడనుంది.
ఈ నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లు బుధవారం విండీస్ దిగ్గజ ప్లేయర్ గ్యారీ సోబర్స్‌ను మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలతోపాటు శుభ్‌మన్ గిల్, అశ్విన్, శార్దూల్ ఠాకూర్ లాంటి క్రికెటర్లు గ్యారీ సోబర్స్‌తో మాట్లాడారు. అనంతరం కోచ్ రాహుల్ ద్రవిడ్ ఆటగాళ్లను అందరిని దగ్గరుండి పరిచయం చేయించాడు.
గిల్ ను పరిచయం చేస్తూ.. మా టీమ్ లో ఉన్న యంగ్, ఎక్సైటింగ్ ప్లేయర్ ఇతడు అని చెప్పడం విశేషం. సోబర్స్, అతని భార్య స్టేడియానికి వచ్చారు. తనను కలిసి టీమిండియా క్రికెటర్లందరికీ సోబర్స్ తన భార్యను ప్రత్యేకంగా పరిచయం చేశాడు. గ్యారీ సోబర్స్ రోహిత్, విరాట్‌లతో ప్రత్యేకంగా ముచ్చటించాడు. ఈ వీడియోను బీసీసీఐ షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. నిజానికి సోబర్స్ ను కలిసి విరాట్ కోహ్లి.. 2020లో అదే గ్యార్‌ఫీల్డ్ సోబర్స్ పేరిట ఉన్న మేల్ క్రికెట్ ఆఫ్ ద డెకేడ్ అవార్డు(గ్యారీ సోబర్స్ అవార్డు) గెలుచుకున్నాడు.
ఇప్పటికే వన్డే, టెస్ట్ జట్లను బీసీసీఐ ప్రకటించింది. టి20 జట్టును మాత్రం కొత్త చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఎంపిక చేయాల్సి ఉంది. ప్రస్తుతం టీమిండియా టెస్టుల్లో నంబర్ వన్, వన్డేల్లో నంబర్ టూ ర్యాంకుల్లో ఉంది. తొలి టెస్ట్ జులై 12న ప్రారంభం కానుంది. డబ్ల్యూటీసీ ఫైనల్లో ఓడిన తర్వాత టీమిండియా ఆడబోతున్న తొలి సిరీస్ ఇదే.
ఇండియా టెస్టు టీమ్: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లి, యశస్వి జైస్వాల్, అజింక్య రహానే, కేఎస్ భరత్, ఇషాన్ కిషన్, అశ్విన్, జడేజా, శార్దూల్, అక్షర్, సిరాజ్, ముకేశ్ కుమార్, జైదేవ్ ఉనద్కట్, నవ్‌దీప్ సైనీ
In Barbados & in the company of greatness! 🫡 🫡#TeamIndia meet one of the greatest of the game - Sir Garfield Sobers 🙌 🙌#WIvIND pic.twitter.com/f2u1sbtRmP
— BCCI (@BCCI) July 5, 2023
చదవండి: చీఫ్ సెలెక్టర్‌గా అజిత్ అగార్కర్ పారితోషికం ఎంతో తెలుసా?