వసీం జాఫర్‌ మేనల్లుడి అద్భుత శతకం.. రెండో వన్డేలో ముంబై ఘన విజయం

Arman Jaffer Star In Mumbai 231 Run Victory Over Oman In 2nd ODI - Sakshi

మస్కట్‌: టీమిండియా మాజీ ఓపెనర్‌ వసీం జాఫర్‌ మేనల్లుడు అర్మాన్‌ జాఫర్‌ (114 బంతుల్లో 122; 11 ఫోర్లు, 3 సిక్సర్లు) సూపర్‌ సెంచరీతో చెలరేగడంతో ఒమన్‌తో జరిగిన రెండో వన్డేలో ముంబై జట్టు 231 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. అర్మాన్‌తో పాటు సుజిత్‌ నాయక్‌ (70 బంతుల్లో 73; 6 ఫోర్లు) రాణించాడు. ఒమన్‌ బౌలర్లలో మహ్మద్‌ నదీమ్‌ 4, నెసట్ర్‌ దంబా 2, కలీముల్లా, ఆకిబ్‌ ఇలియాస్‌ తలో వికెట్‌ పడగొట్టారు. 

అనంతరం భారీ లక్ష్యఛేదనకు దిగిన ఒమన్‌ ముంబై బౌలర్లు మోహిత్‌ అవస్థి (4/31), ధుర్మిల్‌ మట్కర్‌ (3/21), దీపక్‌ షెట్టి (2/9), అమాన్‌ ఖాన్‌(1/8) ధాటికి 22.5 ఓవర్లలో 69 పరుగులకే ఆలౌటైంది. ఒమన్‌ ఇన్నింగ్స్‌లో మహ్మద్‌ నదీమ్‌(35) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ఈ విజయంతో 4 వన్డేల సిరీస్‌లో ముంబై 2-0 ఆధిక్యంలో నిలిచింది. అంతకుముందు జరిగిన తొలి వన్డేలో కూడా ముంబై జట్టే విజయం సాధించింది. మూడో వన్డే సెప్టెంబర్‌ 2న జరుగనుంది.  
చదవండి:క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన స్టార్‌ బౌలర్‌..
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top