
చెన్నై: క్వాంట్‌బాక్స్ చెన్నై గ్రాండ్‌మాస్టర్స్ అంతర్జాతీయ చెస్ టోర్నీ మాస్టర్స్ కేటగిరీలో ప్రపంచ ఐదో ర్యాంకర్, భారత గ్రాండ్‌మాస్టర్ ఇరిగేశి అర్జున్‌కు తొలి పరాజయం ఎదురైంది. ఆదివారం జరిగిన నాలుగో రౌండ్ గేమ్‌లో అర్జున్ 70 ఎత్తుల్లో భారత్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్ నిహాల్ సరీన్ చేతిలో ఓడిపోయాడు.
మరో గేమ్‌లో కార్తికేయన్ మురళీ (భారత్) 46 ఎత్తుల్లో జోర్డాన్ వాన్ ఫారీస్ట్ (నెదర్లాండ్స్)పై గెలుపొందాడు. రే రాబ్సన్ (అమెరికా) –అవండర్ లియాంగ్ (అమెరికా) గేమ్ 26 ఎత్తుల్లో ... విదిత్ (భారత్)–ప్రణవ్ (భారత్) గేమ్ 86 ఎత్తుల్లో... అనీశ్ గిరి (నెదర్లాండ్స్)–విన్సెంట్ కీమెర్ (జర్మనీ) గేమ్ 28 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిశాయి.
ఇదే టోర్నమెంట్ చాలెంజర్స్ కేటగిరీలో భారత గ్రాండ్‌మాస్టర్, హైదరాబాద్ క్రీడాకారిణి ద్రోణవల్లి హారిక మూడో ఓటమిని చవిచూసింది. భారత్‌కే చెందిన లియోన్ ల్యూక్‌తో జరిగిన నాలుగో రౌండ్ గేమ్‌లో హారిక 59 ఎత్తుల్లో ఓడిపోయింది.
ఆధిబన్ (భారత్)–ప్రాణేశ్ (భారత్) గేమ్ 36 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగిసింది. ఇతర గేముల్లో దీప్తాయన్ ఘోష్ (భారత్) 76 ఎత్తుల్లో హర్షవర్ధన్ (భారత్)పై, ఇనియన్ (భారత్) 45 ఎత్తుల్లో ఆర్యన్ చోప్రా (భారత్)పై, అభిమన్యు పురాణిక్ (భారత్) 43 ఎత్తుల్లో వైశాలి (భారత్)పై విజయం సాధించారు.