విరాట్‌కు 'ఫ్లైయింగ్‌ కిస్‌' ఇచ్చిన అనుష్క

anushka sharma gives flying kiss to virat kohli goes viral in social media - Sakshi

ఢిల్లీ: క్రికెటర్స్‌ సతీమణులు స్టేడియంలో కనిపిస్తే చాలు కెమెరాలన్నీ వారివైపే ఉంటాయి. ముఖ్యంగా ఆ ఆటగాడు క్రీజులో ఉంటే వారిపై ఎప్పుడూ ఓ కెమెరా కన్నేసి ఉంటుంది. చైన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లి సతీమణి అనుష్క శర్మ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో కోహ్లి 90 పరుగులు చేసి అజయంగా నిలిచాడు. ఇన్నింగ్స్‌ అనంతరం పెవిలియన్‌ ఎండ్‌కు చేరుకుంటున్న విరాట్‌ను చూసి అనుష్క తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ 'ఫ్లైయింగ్‌ కిస్'‌ ఇచ్చారు. ఇంకేముంది సోషల్‌ మీడియాలో ఈ ఫొటో తెగ హల్‌చెల్‌ చేస్తోంది. కోహ్లి ఇన్నింగ్స్‌ కంటే ఎక్కువగా అనుష్క ఫ్లైయింగ్‌ కిస్‌ ఇచ్చిన సన్నివేశమే చర్చనీయాంశంగా మారింది.

ఈ ఐపీఎల్‌ సీజన్‌ ఆరంభంలో కోహ్లి ఆటతీరుపై అనేక విమర్శలు వచ్చాయి. ఇందుకు కారణం అనుష్క అంటూ సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేశారు. కోహ్లి ఈ ఇన్నింగ్స్‌తో వారందరికి సమాధానం ఇచ్చాడు. ఎవరి వల్ల అయితే అతడు విమర్శలు ఎదుర్కున్నాడో వారి ముందే అద్భుతంగా ఆడడం సంతోషంగా ఉందని నెటిజన్లు కోహ్లికి మద్దతు తెలుపుతున్నారు. కాగా చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు జట్టు 37 పరుగుల తేడాతో గెలిచింది. ఈ మ్యాచ్‌ విజయంలో కోహ్లి ఆడిన ఇన్నింగ్స్‌ కీలకం. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top