Anjum Moudgil Wins Bronze in Changwon Shooting World Cup - Sakshi
Sakshi News home page

ISSF World Cup Changwon: అంజుమ్‌ మౌద్గిల్‌కి కాంస్య పతకం

Jul 18 2022 1:43 PM | Updated on Jul 18 2022 3:40 PM

Anjum Moudgil wins bronze in Changwon Shooting World Cup - Sakshi

కొరియాలో జరుగుతున్న  ప్రపంచకప్‌ షూటింగ్‌ టోర్నీలో మహిళల 50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్‌ ఈవెంట్‌లో అంజుమ్‌ మౌద్గిల్‌ కాంస్య పతకం నెగ్గగా... పురుషుల 50 మీటర్ల రైఫిల్‌ త్రీ పొజిషన్‌ టీమ్‌ విభాగంలో చెయిన్‌ సింగ్, ఐశ్వరీ ప్రతాప్‌ సింగ్, సంజీవ్‌ రాజ్‌పుత్‌లతో కూడిన భారత జట్టు రజత పతకం సాధించింది. ఫైనల్లో అంజుమ్‌ 402.9 పాయింట్లు స్కోరు చేసి మూడో స్థానంలో నిలిచింది. పురుషుల టీమ్‌ ఫైనల్లో భారత్‌ 12–16తో చెక్‌ రిపబ్లిక్‌ జట్టు చేతిలో ఓడిపోయింది.
చదవండి: Zouhaier Sghaier wrestling: భారత రెజ్లర్ల పసిడి పట్టు

Advertisement
 
Advertisement
Advertisement