అంతర్జాతీయ క్రీడా పోటీల్లో మన్యం యువకుల సత్తా

పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా): ఇండో–నేపాల్ అంతర్జాతీయ యూత్ గేమ్స్–2022లో భారత్ తరఫున పాల్గొన్న ఏజెన్సీక్రీడాకారులు తమ సత్తాను చాటారు. నేపాల్‌లోని ఖాట్మండులో జరుగుతోన్న బ్యాడ్మింటన్ డబుల్స్ విభాగం పోటీల్లో భారత్ తరఫున అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరుకు చెందిన పలాసి శ్రీను, జుర్ర పవన్‌కుమార్ పాల్గొన్నారు.
సోమవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో నేపాల్ జట్టుపై విజయం సాధించారు. డుంబ్రిగుడ మండలం కొర్రాయి గ్రామానికి చెందిన కిల్లో రాజేష్ పాల్ ఇండో–నేపాల్ యూత్ గేమ్స్‌లో పాల్గొని ఈ నెల 12న జరిగిన షటిల్ బ్యాడ్మింటన్ సింగిల్ విభాగంలో బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు.
చదవండి: Khelo India 2022: ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో ఏపీ క్రీడాకారుల సత్తా